నమ్మండి.. ఒరిజినల్ ను అస్సలు చెడగొట్టలేదు

నితిన్ హీరోగా రూపొందిన మాస్ట్రో సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాలున్న ఈ సినిమా ను డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం చేస్తున్నారు.

 Hero Nitin About His New Movie Maestro,latest Tollywood News-TeluguStop.com

సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా చేస్తున్నారు.ప్రస్తుతం నితిన్ ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్నాడు.

ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు నటుడిగా మంచి పేరును తీసుకు రాలేదు.అందుకే నటుడిగా పేరును దక్కంచుకునేందుకు ఈ సినిమాను ఆయన ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఆ సందర్బంగా నితిన్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

ఈ సినిమాలో తమన్నా నటించడం చాలా సంతోషాన్ని కలిగించిందని.ఆమె నటిస్తుందా అనే అనుమానం మొదట కలిగింది.

కాని ఆమె పాత్ర నచ్చడంతో నటించేందుకు ఓకే చెప్పిందని చెప్పుకొచ్చాడు.

Telugu Nitin Maestro, Nabha Natesh, Nitin, Tamanna-Movie

ఇంకా నితిన్ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.తాను అంధాదున్ సినిమాను చూసి తప్పకుండా రీమేక్ చేయాలనుకున్నాం.అయితే రీమేక్‌ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.ఉన్నది ఉన్నట్లుగా తీస్తే విమర్శిస్తారు.ఏమైనా కొత్తగా ట్రై చేస్తే చెడగొట్టారు అంటారు.

అందుకే మొదట రీమేక్ విషయంలో టెన్షన్ పడ్డాం.గాంధీ తప్పకుండా ఈ ప్రాజెక్ట్‌ కు న్యాయం చేస్తాడు అనే నమ్మకంతో ఆయన్ను తీసుకున్నాం.

కథను మార్చకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ లో మార్పులు చేర్పులు చేసి అందరిని మెప్పించేలా సినిమాను తెరకెక్కించాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా అంధాదున్ రీమేక్ ను తెరకెక్కించామని.

ఒరిజినల్‌ ఎంతగా అయితే హిట్ అయ్యిందో.మంచి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ను పంచిందో అలాగే ఈ సినిమా కూడా తప్పకుండా అలాగే ఎంటర్ టైన్ మెంట్‌ ను పంచడంతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని నితిన్ నమ్మకం వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube