ఫిదా వదిలేసి బొమ్మరిల్లుపై పడ్డ నితిన్‌..సక్సెస్‌ దక్కేనా

నితిన్‌ ‘లై’ మరియు ‘ఛల్‌ మోహన్‌ రంగ’ చిత్రాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్‌ అయ్యాడు.వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్‌ అవ్వడంతో నితిన్‌ కాస్త టెన్షన్‌లో పడ్డాడు.

 Hero Nithin Wants Follow Bommarillu-TeluguStop.com

ఈ సమయంలోనే ఈయన చేసిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.శతమానంభవతి చిత్రం టీం దిల్‌రాజు, సతీష్‌ వేగేశ్నల కాంబోలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

మొదటి రోజు నుండి ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన విడుదలైన ప్రతి పోస్టర్‌ ఆకట్టుకుంటూ వచ్చింది.దాంతో సినిమాపై ఆసక్తి, అంచనాలు భారీగా పెరిగాయి.

దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన ఈ చిత్రంను మొదట ‘ఫిదా’ విడుదల అయిన తేదీన విడుదల చేయాలని భావించారు.కాని అది సాధ్యం కాలేదు.షూటింగ్‌ అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా జరగడంతో జులైలో విడుదలకు మీ పడలేదు.ఫిదా సెంటిమెంట్‌ను మిస్‌ అయిన నిర్మాత దిల్‌రాజు బొమ్మరిల్లు సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అయిన బొమ్మరిల్లు 12 సంవత్సరాల క్రితం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఆ చిత్రం సెంటిమెంట్‌ను వాడుకుంటూ శ్రీనివాస కళ్యాణంను విడుదల చేయబోతున్నారు.బొమ్మరిల్లు సినిమాతో దిల్‌రాజు స్థాయి అమాంతం పెరిగింది.

ఇక ఈ చిత్రంతో కూడా తప్పకుండా దిల్‌రాజు మరోసారి నిర్మాతగా లాభాలను దక్కించుకుంటాడు అనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.ఇక నిర్మాత మాత్రమే కాకుండా హీరో నితిన్‌ మరియు హీరోయిన్‌ రాశిఖన్నా కూడా ఈ చిత్రంతో లాభపడటం ఖాయం అంటున్నారు.

‘శతమానం భవతి’ చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ కుటుంబ కథా, ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రంగా అవార్డు దక్కింది.అందుకే ఈ చిత్రంపై కూడా జాతీయ స్థాయిలో ఆసక్తి ఉంది.

తప్పకుండా శ్రీనివాస కళ్యాణం కూడా భారీ ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు బొమ్మరిల్లు సెంటిమెంట్‌ కూడా వర్కౌట్‌ అవుతుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube