ఏంటి... కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి పై కూడా పడిందా...  

Hero Nithin Postponed His Marriage For The Corona Virus Affect -

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న సంగతి అందరికీ బాగా తెలిసిందే.అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ప్రభావం పలు రంగాల పై కూడా పడింది.

Hero Nithin Postponed His Marriage For The Corona Virus Affect

దీంతో ఇప్పటికే కొన్ని సంస్థలు తమ సంస్థలో పని చేస్తున్నటువంటి ఉద్యోగులకు సెలవులు ఇస్తున్నారు.అయితే తాజాగా ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ యంగ్ హీరో వివాహంపై కూడా పడినట్లు పలు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ దాదాపుగా పదేళ్లకు పైగా ప్రేమించినటువంటి తన ప్రేయసి శాలిని రెడ్డిని వచ్చే నెల 16 వ తారీఖున దుబాయ్ లో నితిన్ కి అత్యంత సన్నిహితులైన కొంతమంది మధ్యలో పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.అంతేకాక ఇప్పటికే శాలిని రెడ్డికి మరియు నితిన్ కి నిశ్చితార్థం కూడా జరిగింది.

అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ వల్ల నితిన్ కూడా తన పెళ్లిని కొంత కాలం పాటు వాయిదా వేసుకున్నట్లు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.అంతేగాక ఇప్పటికే పలు ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా దుబాయ్ వెళ్లాలంటే పలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉండడంతో వధూవరుల కుటుంబ సభ్యులు పెళ్లిని దుబాయ్ లో కాకుండా హైదరాబాద్ నగరంలోని జరిపేందుకు పలు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఏంటి… కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి పై కూడా పడిందా…-Latest News-Telugu Tollywood Photo Image

మరి తన పెళ్లిపై వస్తున్నటువంటి ఈ వార్తలపై హీరో నితిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల నితిన్ నటించినటువంటి భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.అంతేగాక దర్శక నిర్మాతలకు కూడా మంచి కాసుల పంట పండించింది.అయితే ప్రస్తుతం నితిన్ రంగ్ దే అనే చిత్రంలో నటిస్తున్నాడు.

చిత్రంలో నితిన్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు కీలక సన్నివేశాలు కూడా పూర్తయినట్లు సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hero Nithin Postponed His Marriage For The Corona Virus Affect Related Telugu News,Photos/Pics,Images..

footer-test