నితిన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ 'పవర్‌ పేట' అప్‌ డేట్‌ వచ్చేసింది

నితిన్‌ ప్రస్తుతం నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.చెక్‌, రంగ్‌ దే సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి.

 Hero Nithin Dream Project Power Peta Movie Shooting Update-TeluguStop.com

మరో రెండు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి.నాలుగు సినిమాలు విడుదల అయిన తర్వాత నితిన్ కాస్త బ్రేక్ తీసుకుంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ పేట సినిమా షూటింగ్ కు నితిన్‌ ఏర్పాట్లు చేస్తున్నాడు.గత రెండు సంవత్సరాలుగా పవన్ పేట సినిమా గురించి మీడియా వర్గాల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 Hero Nithin Dream Project Power Peta Movie Shooting Update-నితిన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ పవర్‌ పేట’ అప్‌ డేట్‌ వచ్చేసింది-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నితిన్‌ కు ఈ సినిమా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.దాదాపుగా రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం నితిన్‌ కష్టపడాల్సి ఉంది.

అయినా కూడా చాలా ఇష్టంగా ఆ సినిమా కోసం నితిన్‌ వెయిట్‌ చేస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ అప్ డేట్‌ ను ఇవ్వడం ద్వారా ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి రేకెత్తుతోంది.

పవర్‌ పేట సినిమాలో నితిన్‌ 20, 40, 60 ఏళ్ల వయసు వాడి గా కనిపించబోతున్నాడు.మూడు జనరేషన్‌ ల పాత్రల్లో కనిపించడం అంటే మామూలు విషయం కాదు.

ఈ సినిమా కథ రీత్యా రెండు పార్ట్‌ లు గా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ఈ సినిమా పై ఉన్న ఇష్టం నేపథ్యంలో నితిన్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

రికార్డ్‌ బ్రేకింగ్‌ బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా షూటింగ్‌ ను మే నెలలో అధికారికంగా పట్టాలెక్కించే ఉద్దేశ్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నితిన్‌ ఈ విషయమై ప్రస్తుతం ఆసక్తిగా ఉన్నట్లుగా తాజాగా చెక్ సినిమా ప్రమోషన్‌ సందర్బంగా వెళ్లడి అయ్యింది.నితిన్‌ ఈ సినిమా కు సంబంధించి స్వయంగా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

#Rang De Movie #Nithin #Power Peta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు