నితిన్‌ కండీషన్స్‌తో జుట్టు పీక్కుంటున్న దర్శకుడు  

Hero Nithin Conditions To Venky Kudumula-

యంగ్‌ హీరో నితిన్‌ శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత మళ్లీ ఇప్పటి వరకు మరే సినిమాను మొదలు పెట్టలేదు.ఎట్టకేలకు భీష్మ చిత్రం పూజా కార్యక్రమాలు అయ్యాయి.గత ఆరు నెలలుగా ఈ చిత్రం గురించి చర్చలు జరిగాయి...

Hero Nithin Conditions To Venky Kudumula--Hero Nithin Conditions To Venky Kudumula-

చివరకు సినిమాను ప్రారంభించారు.అయితే ఇంకా కూడా రెగ్యులర్‌ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌ తెలియరావడం లేదు.అసలు ఎప్పుడు సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందనే విషయంపై క్లారిటీ లేదు.

ఎందుకంటే స్క్రిప్ట్‌ విషయంలో నితిన్‌ ఇంకా మార్పులు చేర్పులు చెబుతూనే ఉన్నాడట.

Hero Nithin Conditions To Venky Kudumula--Hero Nithin Conditions To Venky Kudumula-

‘ఛలో’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే సినిమా ప్రారంభం అయ్యి విడుదల కూడా అవ్వాల్సి ఉంది.కాని నితిన్‌ కథ విషయంలో టెన్షన్‌ పడుతున్నాడు.

ఎప్పుడెప్పుడు సినిమా చేయాలా అనే తొందర పడకుండా కథ మొత్తం ఓకే అయిన తర్వాతే సినిమాను పట్టాలెక్కించాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.పదే పదే మార్పులు చెబుతున్న నేపథ్యంలో దర్శకుడు వెంకీ కుడుముల జట్టు పీక్కుంటున్నాడట...

నితిన్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సక్సెస్‌ ఖచ్చితంగా కావాలి.మరి ఇలాంటి సమయంలో ఎలాంటి అజాగ్రత్తతో ఉండవద్దనే ఉద్దేశ్యంతో నలుగురి సలహాలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.

మరి ఈ చిత్రంతో దర్శకుడు వెంకీ కుడుముల హీరో నితిన్‌కు సక్సెస్‌ ఇస్తాడేమో చూడాలి.డిసెంబర్‌లో ఈ చిత్రంను విడుదల చేసేలా నితిన్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.డిసెంబర్‌ వరకు షూటింగ్‌ పూర్తి చేయాలని నితిన్‌ కండీషన్‌ పెట్టడంతో దర్శకుడు వెంకీ కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది...