60 ఏళ్ళ వృద్ధుడిగా హీరో నితిన్..?- Hero Nithin As 60 Years Old Man Character

hero nithin as 60 years old man character in power peta movie, hero nithin, 60 years old, tollywood hero, power peta, rang de, check, tollywood, politics story, eluru - Telugu 60 Years Old, Check, Eluru, Hero Nithin, Politics Story, Power Peta, Rang De, Tollywood, Tollywood Hero

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.తాను ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలలో మంచి విజయాన్ని సాధించుకున్నారు.ప్రతి ఒక్క పాత్ర తనకు తగ్గట్టుగా ఉన్నట్లు అనిపిస్తాయి.నితిన్ కు నటన పట్ల ఆసక్తి కల్పించిన సినిమా తొలిప్రేమ.ఇందులో నటించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను చూసి తాను కూడా నటనపై ఆసక్తి చూపారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం యంగ్ బాయ్ నితిన్ ఓల్డ్ మాన్ లా కనిపించనున్నాడు.

 Hero Nithin As 60 Years Old Man Character-TeluguStop.com

2002లో ‘జయం’ సినిమా ద్వారా తొలిసారిగా పరిచయమైన నితిన్ ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందాడు.అంతేకాకుండా ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడిగా గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత వరుస సినిమాలతో మంచి హిట్ ను సాధించుకొని గత ఏడాదిలో వచ్చిన భీష్మ వరకు గొప్ప విజయాన్ని అందుకున్నారు.కాగా నితిన్ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో తన లుక్ లో ఎలాంటి మార్పులు లేకుండా ఉన్నాయి.

 Hero Nithin As 60 Years Old Man Character-60 ఏళ్ళ వృద్ధుడిగా హీరో నితిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఓల్డ్ మాన్ గెటప్ లో చేయనున్న నితిన్.ఏలూరు రాజకీయ నేపథ్యంలో సాగుతున్న పొలిటికల్ డ్రామా లో వస్తున్న ‘పవర్ పేట’ అనే సినిమాల్లో 60 ఏళ్ల రాజకీయ నాయకుడిగా నటించనున్నాడు.

కాగా దీనికి సంబంధించిన గెటప్ ను సినీ నిర్మాతలు ఫోటోషూట్ చేయగా నితిన్ కు ఈ గెటప్ సెట్ అవడంతో సంతోషంగా ఉందని తెలిపారు.కాగా ఈ గెటప్ కు సంబంధించిన ఫోటోలు రావడానికి కాస్త సమయం పడుతుంది.

ఇదిలా ఉంటే నితిన్ మరో రెండు సినిమాలు ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి.ఈ సినిమాల విడుదల తర్వాత బాలీవుడ్ లో విజయం సాధించిన ‘అంధధున్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.కాగా ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందని చిత్ర బృందం తెలిపారు.

ఈ సినిమా తర్వాత మరో సినిమా ఆఫర్ రాగా సెట్ లోకి వెళ్లనున్నాడు.

#Rang De #Politics Story #Power Peta #Check #Eluru

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు