పెళ్లి త‌ర్వాత నిఖిల్ కొత్త ప్ర‌యోగం.. స‌క్సెస్ అవుతాడా?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ఇటీవ‌ల ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే.భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో నిఖిల్ పెళ్లి ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో అంగ‌రంగ వైభంగా జ‌రిగింది.

 Hero Nikhil To Test His Luck As A Director! Hero Nikhil, Director, Latest News,-TeluguStop.com

అయితే క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కూడ‌ద‌నే ఉద్ధేశ్యం తో త‌న‌ పెళ్ళిని అతి త‌క్కువ బంధువుల మ‌ధ్య కానిచ్చేశాడు.ఇక పెళ్లి త‌ర్వాత శ్రీ‌మ‌తి ప‌ల్ల‌వితో ఎంజాయ్ చేయ‌డంతో పాటు.

ఫిజిక్‌పై ఫుల్ ఫోకస్ పెట్టాడు నిఖిల్‌.

ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియా వేధిక‌గా ఇటీవ‌ల `సూపర్ డ్రై` అనే ట్యాగ్‌తో సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.పెళ్లి త‌ర్వాత ఈ యంగ్ హీరో‌ ద‌ర్శ‌కుడిగా మారాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌.

ఈ విష‌యం స్వ‌యంగా నిఖిల్‌నే చెప్పాడు.తాజాగా ఆలీతో సరదాగా ప్రోగ్రాంలో పాల్గొన్న నిఖిల్.

త‌న గురించి ఎన్నో విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచుకున్నారు.

ఇందులో భాగంగా.

త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాన‌ని నిఖిల్ స్ప‌ష్టం చేశారు.ఇక తాను దర్శకత్వం వహించే చిత్రం పిల్లల చిత్రమనీ.

ఒక విధంగా చెప్పాలంటే ప్రయోగాత్మక చిత్రమనీ వెల్ల‌డించాడు.అయితే వాస్త‌వానికి దర్శకుడు అవ్వాలనే ఉద్ధేశంలో చిత్ర పరిశ్రమకు వచ్చి దర్శకత్వ శాఖలో నిఖిల్ ప‌ని చేశారు.

అయితే అనుకోకుండా శేఖర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ `హ్యాపీ డేస్` సినిమాతో హీరో అయ్యాడు.ఇక ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ.తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇలాంటి త‌రుణంలో నిఖిల్‌ దర్శకత్వంపై దృష్టి సారించ‌బోతున్నారు.

మ‌రి త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడిగా మార‌బోతున్న నిఖిల్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడో చూడాల్సి ఉంది.కాగా, ప్ర‌స్తుతం నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 చేస్తున్నాడు.

దీంతో పాటు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో `18 పేజెస్` అనే సినిమా కూడా చేయ‌బోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube