గందరగోళంగా ఉందంటూ నిఖిల్ ఆవేదన.. దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ ట్వీట్!

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు యంగ్ హీరో నిఖిల్ అందరికీ సుపరిచితమే.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటిస్తూ కెరియర్లో ముందుకు పోవడానికి నిఖిల్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

 Hero Nikhil Siddharth Tweet On Corona Pandemic Situatio, Nikhil Siddharth, Corona, Tweet Viral, Tollywood-TeluguStop.com

ఈ క్రమంలోనే నిఖిల్ తన ప్రేయసి పల్లవితో వివాహం తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఇలా పెళ్లి తర్వాత నిఖిల్ నటించిన అర్జున్ సురవరం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ యంగ్ హీరోకి వరుస అవకాశాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే అఖిల్ ఏకంగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులలో పాల్గొంటున్నారు.అయితే ఇప్పటికే ఈయన నటించిన కార్తికేయ 2,18 పేజెస్ చిత్రాలు షూటింగ్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా తన సినిమాలు విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర గందరగోళానికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈయన ఆందోళనకు గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.

అర్జున్ సురవరం సినిమా తర్వాత నాలుగు సినిమాలకు కమిట్ అయి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో కరోనా ప్రతి ఒక్కరి పై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మహమ్మారి వల్ల తమ కెరియర్ ఎన్నో ఇబ్బందులలో పడుతోందని అర్జున్ సురవరం సినిమా తర్వాత ఎంతో అద్భుతమైన సినిమాలను ఎంపిక చేసుకొని వాటిలో నటిస్తే ఆ సినిమాలను విడుదల చేయడానికి విడుదల తేదీల విషయంలో ఎంతో గందరగోళం ఏర్పడిందని ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే పూర్తిగా సాధారణ పరిస్థితులు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు నిఖిల్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube