మద్యం తాగమని సలహా ఇస్తున్న హీరో నిఖిల్... సీరియస్ అవుతున్న నెటిజన్లు

సెలబ్రెటీలు మార్కెట్ లోకి వచ్చే ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటారు.యాడ్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా క్యాంపైన్ చేస్తూ వాటికి మంచి మార్కెట్ కల్పిస్తారు.

 Nikhil Promoting Alcohol, Tollywood, Bollywood, Celebrities, Alcohol Promotion,-TeluguStop.com

అయితే ఒక్కోసారి సెలబ్రెటీలు చేసే ఈ ప్రమోషన్ గతి తప్పుతూ ఉంటుంది.ముందుగా ఉత్సాహం కొద్ది ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసిన తరువాత వాటి కారణంగా ప్రజాగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.

ఇప్పుడు నిఖిల్ కి కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది.తాజగా ఈ కుర్ర హీరో ఓ ఆల్కహాల్ బ్రాండ్ ప్రోడక్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రమోట్ చేశాడు.

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రెటీలు ఆల్కహాల్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు.అలాగే నిఖిల్ కూడా విస్కీ బ్రాండ్ ని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేస్తున్నాడు.
నా దగ్గర ఉన్నది నిజంగా అసాధారణమైనది.ఈ అద్భుతమైన పరిమిత ఎడిషన్ ప్యాక్ వెనుక కథ ఎవరికీ తెలియదు.ఇది ఎక్సట్రార్డినరీ కంటే తక్కువ ఏమీ కాదు.అదే ఉత్తేజకరమైనది.

ఎందుకంటే నేను గొప్ప స్టోరీలను ప్రేమిస్తున్నాను” అని పోస్ట్ చేశాడు.దీనికి నిఖిల్ స్టైలిష్ గా నిలబడి ఉన్న ఓ ఫోటోని జత చేశాడు.

ఈ పిక్ లో నిఖిల్ పక్కన విస్కీ బాటిల్, పెగ్ గ్లాస్ కనిపిస్తున్నాయి.అయితే ఇలా ఆల్కహాల్ ని నిఖిల్ ప్రమోట్ చేయడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్ లో సినిమా ముందు మద్యం త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ఓ వైపు ప్రకటనలు ఇస్తూ మరో వైపు సోషల్ మీడియా ద్వారా మద్యం త్రాగమని ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.ఈ మధ్య కాలంలో సెలబ్రెటీలు సమాజానికి ప్రమాదకరమైన మద్యం, ఆన్లైన్ జూదాన్ని వారి సంపాదన కోసం ప్రమోట్ చేయడం చూస్తూ ఉంటే వాళ్ళే సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఉందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube