మల్టీస్టారర్‌ వద్దన్నాడట, ఎందుకో తెలుసా?  

Hero Nikhil Dont Want To Act In Multi Starrer Movie-multi Starrer Movie,tollywood Box Office,tollywood Gossips,tollywood Multi Starrer Movie

హ్యాపీడేస్‌ నిఖిల్‌ ఆమద్య చాలా స్పీడ్‌గా సినిమాలు చేశాడు.కాని ఇప్పుడు మాత్రం ఆ స్పీడ్‌ కనిపించడం లేదు.ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతున్న కారణంగా నిఖిల్‌ సినిమాల సంఖ్య తగ్గించినట్లుగా తెలుస్తోంది.ఇదే సమయంలో అర్జున్‌ సురవరం సినిమా వివాదంలో చిక్కుకోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో సినిమాను చాలా ఆలస్యంగా విడుదల చేయబోతున్నారు.

Hero Nikhil Dont Want To Act In Multi Starrer Movie-multi Starrer Movie,tollywood Box Office,tollywood Gossips,tollywood Multi Starrer Movie Telugu Tollywood Movie Cinema Film Latest News-Hero Nikhil Dont Want To Act In Multi Starrer Movie-Multi Movie Tollywood Box Office Gossips Tollywood

ఎట్టకేలకు విడుదల కాబోతున్న సినిమా గురించి మాట్లాడేందుకు మీడియా ముందుకు నిఖిల్‌ వచ్చాడు.

ఈ సందర్బంగా మల్టీస్టారర్‌ సినిమాల గురించి మాట్లాడాడు.తాను మల్టీస్టారర్‌ సినిమాను చేసేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు.కాని అన్ని అనుకూలించడం లేదన్నాడు.

ఇటీవలే రానాతో ఒక మల్టీస్టారర్‌ సినిమా చేయాలని ఆఫర్‌ వచ్చింది.కాని ఆ సినిమాను నేను చేయలేక పోయాను.కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో నేను నటించలేను అంటూ చెప్పాను.మల్టీస్టారర్‌ చిత్రం ఇప్పుడు కాకున్నా మళ్లీ ఎప్పుడైనా చేస్తానంటూ నిఖిల్‌ హామీ ఇచ్చాడు.

/br>

నిఖిల్‌ మల్టీస్టారర్‌ సినిమా క్యాన్సిల్‌కు సరైన కారణం అయితే చెప్పలేదు కాని సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో రానా పాత్రకు ఎక్కువ ప్రాముఖ్యత ఉండి తన పాత్రకు తక్కువ ప్రాముఖ్యత ఉండటం వల్లే ఆయన నో చెప్పాడంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.మల్టీస్టారర్‌ చిత్రాలు అంటే పాత్రలను చూసుకోకుండా, కాస్త అటు ఇటు అయినా చేయాల్సి ఉంటుంది.కాని నిఖిల్‌ మాత్రం అలా కాదనిపిస్తుంది.అందుకే ఆయన నుండి మల్టీస్టారర్‌ సినిమాలు రావేమో అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.