హిట్ మూవీ సీక్వెల్ ఫిక్స్ చేసిన హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి!  

కార్తికేయ సీక్వెల్ కి రెడీ అవుతున్న దర్శకుడు చందూ మొండేటి. నిర్మాతగా అభిషేక్ పిక్చర్స్. .

  • హ్యాపీ డేస్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు నిఖిల్. ఈ యువ హీరో తరువాత కమర్షియల్ హీరోగా ట్రై చేసి దారుణమైన ఫ్లాప్ లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫైనల్ గా స్వామీ రారా లాంటి డిఫరెంట్ కంటెంట్ తో హిట్ కొట్టి వెంటనే కార్తికేయ లాంటి మిస్టరీ థ్రిల్లర్ తో సెకండ్ హిట్ ని తన ఖాతాలో వేసుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అదే సినిమాతో దర్శకుడుగా పరిచయం అయిన చందూ మొండేటి ప్రేమమ్ రీమేక్ తో చైతుకి మళ్ళీ హిట్ ఇచ్చాడు. అయితే సవ్యసాచి సినిమాతో ఊహించని ఫ్లాప్ సొంతం చేసుకున్నాడు.

  • ఇదిలా వుంటే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మూవీ మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనుంది. అది కూడా కార్తికేయ మూవీకి సీక్వెల్ కావడం విశేషం. కార్తికేయ సినిమా టైంలోనే దానికి సీక్వెల్ చేస్తామని చెప్పడంతో పాటు స్టొరీలో కూడా సీక్వెల్ వుంటుంది అనే విధంగా దర్శకుడు హింట్ ఇచ్చాడు. అయితే అప్పుడు అనుకున్న సీక్వెల్ కాస్తా నాలుగేళ్ల తర్వాత కార్యరూపం దాల్చడం విశేషం. ఈ సీక్వెల్ కి సంబంధించిన స్టొరీని చందూ ఇప్పటికే నిఖిల్ కి చెప్పాడానికి అతను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ప్రస్తుతం అర్జున్ సురవరం సినిమా చేస్తున్న నిఖిల్ ఈ సినిమాని రిలీజ్ చేసిన వెంటనే కార్తికేయ 2 మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది.