విలన్ గా మరో టాలీవుడ్ హీరో...  

Hero Naveen Chandra Got A Chance To Act In Ajith Movie - Telugu Ajith Movie News, Ajith News, Naveen Chandra, Naveen Chandra Got A Chance To Act In Ajith Movie, Naveen Chandra Movie News, Naveen Chandra Mvoie News

తెలుగులో అప్పట్లో  వచ్చిన అందాల రాక్షసి అనే చిత్రంలో నటించినటువంటి హీరో నవీన్ చంద్ర ప్రేక్షకులకి బాగా గుర్తు ఉంటాడు.అంతేగాక ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టువంటి అరవింద సమేత చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

Hero Naveen Chandra Got A Chance To Act In Ajith Movie

అయితే అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకి తెరపై కనిపిస్తున్నప్పటికీ సరైన హిట్ లేక గుర్తింపుకు కరువయ్యాడు నవీన్.

అయితే తాజాగా నవీన్ చంద్ర కి తమిళ్ నుంచి చి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఆఫర్ హీరోగా కాకుండా విలన్ పాత్రని సమాచారం.అయితే తాజాగా కోలీవుడ్ లో తమిళ్ తలైవా అజిత్ వలిమై అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దర్శకుడు వినోద్ నవీన్ చంద్ర కి తన పాత్రకు సంబంధించినటువంటి సన్నివేశాలను మరియు కథాంశాన్ని కూడా వినిపించాడని, ఈ చిత్రంలో నవీన్ చంద్ర పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండటంతో నవీన్ కూడా వెంటనే ఓకే చెప్పినట్లు పలువురు టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.

అయితే హీరోగా తన కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ నవీన్ చంద్ర మాత్రం తాను నటించేటువంటి చిత్రంలో తన పాత్రకంటూ ప్రాధాన్యత ఉంటే చాలునుకుంటూ గెస్ట్ అప్పియరెన్స్ గా కూడా నటిస్తున్నాడు.అంతేగాక ఇటీవల కాలంలో నవీన్ చంద్ర నెగిటివ్ రోల్ లో నటించిన టువంటి అరవింద సమేత మంచి హిట్ కాగా, దేవదాస్ చిత్రం ఫర్వాలేదనిపించింది.అందుకే నవీన్ చంద్ర కూడా ఈ తమిళ్ ఆఫర్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు