రహస్య పెళ్లిపై స్పందించిన రొమాంటిక్‌ హీరో  

Hero Navdeep Marriage Rumors - Telugu Navdeep, Navdeep Marriage, Navdeep Reacts On Marriage Rumors, Run Web Series

హీరోగా పలు చిత్రాల్లో నటించిన నవదీప్‌ కెరీర్‌లో ఎక్కువ శాతం ఫ్లాప్స్‌ పడటంతో ఆయనకు ఆఫర్లు తగ్గాయి.సినిమాల్లో హీరోగా నటించకున్నా కూడా హీరో స్టేటస్‌తో సోషల్‌ మీడియాలో చాలా రెగ్యులర్‌గా కనిపిస్తూ వచ్చే నవదీప్‌ మరోసారి మీడియాలో చర్చనీయాంశం అయ్యాడు.

 Hero Navdeep Marriage Rumors

తాజాగా నవదీప్‌ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న నవదీప్‌ కొత్త జీవితంను ప్రారంభించాడు అంటూ వార్తలు వచ్చాయి.
ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలపై నవదీప్‌ స్పందించాడు.తాను పెళ్లి చేసుకున్న విషయం నిజం కాదు.అసలు నాకు పెళ్లిపై ఆసక్తి లేదు.ఇప్పట్లో పెళ్లి ఆలోచనే లేదు అంటూ పేర్కొన్నాడు.

నటుడిగా తనను తాను నిరూపించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్న నవదీప్‌ తాజాగా రన్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించాడు.ఆ సినిమా ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతుంది.

రహస్య పెళ్లిపై స్పందించిన రొమాంటిక్‌ హీరో-Movie-Telugu Tollywood Photo Image

ఆయన నటనకు మంచి మార్కులు పడ్డా సినిమాకు మాత్రం మైనస్‌ మార్కులు పడుతున్నాయి.

ఏమాత్రం ఆకట్టుకోలేదు అంటూ రన్‌ చిత్రానికి రివ్యూలు వచ్చాయి.అంతకు ముందు నటించిన మస్తీస్‌ చిత్రం మాత్రం మంచి విజయం సాధించింది.సినిమాల్లో ఆఫర్లు రాకపోవడంతో వరుసగా వెబ్‌ సిరీస్‌లు చేస్తున్న నవదీప్‌ డిజిటల్‌లో అయిన హీరోగా సక్సెస్‌ అవుతాడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test