పెదవి విప్పని హీరో నవదీప్.. ఎఫ్-క్లబ్ లో డ్రగ్స్ దందా

సినీ నటుడు నవదీప్ ను ఈడీ అధికారులు సోమవారం దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించారు.అయినా నవదీప్ ఎక్కడ చిక్కలేదు.

 Hero Navadeep In Drugs Case Ed Investigation Details-TeluguStop.com

కీలక అంశాలపై మౌనమే సమాధానంగా వ్యవహరించారు.ఈడీ విచారణకు నవదీప్ తో పాటు ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ గా వ్యవహరించిన ఆర్పిత్ సింగ్ కూడా హాజరయ్యారు.

వీరిద్దరూ ఎఫ్-క్లబ్ బ్యాంక్ అకౌంట్లు.ఆర్థిక వ్యవహారాలు సంబంధించిన వివరాలతో పాటు తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను ఈడీకి సమర్పించారు.

 Hero Navadeep In Drugs Case Ed Investigation Details-పెదవి విప్పని హీరో నవదీప్.. ఎఫ్-క్లబ్ లో డ్రగ్స్ దందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నవదీప్ టాలీవుడ్ డ్రగ్స్ కేసు వ్యవహారం వెలుగులోకి రాక పూర్వం ఎఫ్-క్లబ్ తో క్లబ్ ను నడిపిన విషయం తెలిసిందే.ఈ ఎఫ్-క్లబ్ కేంద్రంగానే సినీ నటులు, ప్రముఖులకు డ్రగ్స్ అభియోగాలు వెల్లువెత్తడంతో మొత్తం వ్యవహారం, ఆర్థిక లావాదేవీలు, విదేశాలకు డబ్బులు పంపించడం తదితర వ్యవహారాలను వెలికితీసేందుకు ఈడీ రంగంలోకి  దిగిన విషయం కూడా తెలిసిందే.

ఎఫ్-క్లబ్ లో తరచూ పార్టీలు జరిగేవని ఈ పార్టీలకు వచ్చే వారంతా సినీ నటులు, ప్రముఖు లేనని వారందరికీ డ్రగ్స్ సరఫరా నేనే చేశానని డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ సమాచారం ఇవ్వడంతో పాటు ఎవరెవరు పాల్గొన్నారన్న ఆధారలతో సిట్ విచారించింది.ఈ విచారణ లోని అంశాల ఆధారంగానే ఈడీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగం పై పలువురు సినీ నటులకు నోటీసులు జారీ చేసి ఆర్థిక లావాదేవీలు ప్రధాన లక్ష్యంగా విచారస్తుంది.

ఎఫ్-క్లబ్ లాంజ్ లో 2015 నుంచి 2017 మధ్య కాలంలో దాదాపు 30 పార్టీలు జరిగాయని, ఈ పార్టీ అన్నిట్లోనూ నవదీప్ పాల్గొన్నట్లు తేలింది.సోమవారం విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఎఫ్-క్లబ్ లాంజ్ లో జరిగిన పార్టీలు, హాజరైన వారి నుంచి తీసుకున్న మొత్తం డబ్బులు బదలాయింపు తదితర అంశాలపై ఆరా తీశారు.

Telugu Arpit Singh, Drugs Case, Drugs Peddler Calvin, Ed Investigation, F Club, F-club Manager, Hero Navadeep, Money Laundering, Navadeep Ed Investigation Details, Tollywood Drugs Case-Movie

నవదీప్ తో కెల్విన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయనతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీసింది.అంతే కాకుండా కెల్విన్ తోపాటు డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్న పీటర్, కమింగోల ఖాతాలకు నవదీప్ ఖాతాల నుంచి బదిలీ అయిన మొత్తం, ఎఫ్-క్లబ్ ఖాతాలో నుంచి బదిలీ అయిన నగదురపై ఆరా తీశారు.అయితే క్లబ్ ఖాతాలకు సంబంధించిన పూర్తి వ్యవహారం తనకు తెలియదని అప్పట్లో ఎఫ్-క్లబ్ కి మేనేజర్ గా వ్యవహరించిన ఆర్పిత్ సింగ్ కు తెలుస్తాయని నవదీప్ చెప్పారు.ఎఫ్-క్లబ్ లో జరిగిన పార్టీలకు వచ్చిన వారే నగదు బదిలీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి అని అడిగితే మౌనంగా ఉండిపోయాడు.

క్లబ్ నుంచి జరిగిన బదిలీలు ఎక్కువగా కెల్విన్ గ్యాంగ్ సభ్యులకు వెళ్ళడం ఏంటి.? అని వేసిన ప్రశ్నలకు మౌనమే సమాధానమైయింది.

#Hero Navadeep #TollywoodDrugs #NavadeepEd #Drugs Case #F-club Manager

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు