శ్రీరెడ్డి విమర్శలపై స్పందించిన నాని భార్య…ప‌బ్లిసిటీ కోసం మ‌రీ ఇలానా.?       2018-06-13   00:54:51  IST  Raghu V

“ఓపికకు కూడా ఒక లిమిట్ ఉంటుంది” అని తాను శ్రీరెడ్డి విషయంలో ఎందుకు రియాక్ట్ కాదలుచుకోలేదు అనే విషయంతోపాటు.. క్లిక్స్ & వ్యూస్ కోసం సదరు సెన్స్ లెస్ న్యూస్ పబ్లిష్ చేస్తున్న మీడియా హౌసెస్ మీద కూడా ఫైర్ అయ్యాడు నాని.

-

శ్రీరెడ్డికి “బిగ్ బాస్ 2″లో పాల్గొనే అవకాశం వచ్చినప్పటికీ.. నాని ఆమె అవకాశాన్ని కాళరాశాడని, ఆమె ఉంటే షో కనీసం హోస్ట్ కూడా చేయనన్నాడని కథనాలు రావడంతో ఈ గొడవ మొత్తం రైజ్ అయ్యింది. రైజ్ అని గొడవను సదరు శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి సిగ్గులేకుండా పోస్ట్ చేసిన బూటకపు కథనాల వలన ఆ రచ్చ కాస్త చండాలంగా రూపాంతరం చెందింది. మరి ఇప్పుడు నాని లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నాడు కాబట్టి ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందో.. లేక మెంటల్లీ డిస్టర్బడ్ శ్రీరెడ్డి ఇంకా పేట్రేగిపోయి ఈ రచ్చని ఇంకాస్త పెద్దది చేస్తుందో చూడాలి.

ఇది ఇలా ఉండగా ఈ విషయంపై నాని భార్య ట్విట్టర్ లో స్పందించారు. నాని భార్య ట్వీట్ :

-

‘‘సినీ పరిశ్రమ చాలా ద‌యాగుణంతో ఉంటుంది. కానీ, ప‌బ్లిసిటీ కోసం ఇతరుల జీవితాల‌తో ఆడుకుంటున్న వారు కూడా అప్పుడప్పుడు అందులోకి వ‌స్తుండ‌టం నన్ను ఇబ్బందికి గురిచేస్తోంది. అయితే వారు చేస్తున్న చెత్త వ్యాఖ్యలను ఎవ‌రూ నమ్మరనుకోండి. కానీ, వారి వ్యక్తిగత జీవితాన్ని అంత దిగువ స్థాయికి దిగ‌జార్చుకోవ‌డానికి ఎలా సిద్దప‌డ‌తారో’’

లీగల్ నోటీసు పై శ్రీరెడ్డి స్పందించి లీగల్ గా ఫైట్ చేద్దాము అని ట్వీట్ చేసింది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.