ఆ రెండు ఫ్లాప్‌ అయినా కూడా నాని మళ్లీ అదే తప్పు చేయనున్నాడా?  

Hero Nani Wants To Do 96 Movie Remake In Telugu-

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు రీమేక్‌లు చేసి సక్సెస్‌లు దక్కించుకున్నారు.కాని కొందరు హీరోలు మాత్రం చేసిన ఒకటి రెండు రీమేక్స్‌తో ఫ్లాప్‌లనే చవి చూశారు.అందుకే వారికి రీమేక్‌లు అచ్చి రావని వారి అభిమానులు అనుకుంటున్నారు..

Hero Nani Wants To Do 96 Movie Remake In Telugu--Hero Nani Wants To Do 96 Movie Remake In Telugu-

తాజాగా నాని విషయానికి వస్తే ఒక రీమేక్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది.తమిళంలో రూపొందిన ‘96’ అనే చిత్ర రీమేక్‌ రైట్స్‌ను మరియు డబ్బింగ్‌ రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కొనుగోలు చేయడం జరిగింది.ఆ రీమేక్‌లో నాని హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళంలో విజయ్‌ సేతుపతి మరియు త్రిషలు కలిసి నటించిన ఈ చిన్న చిత్రం అక్కడ భారీ అంచనాల నడుమ అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మొదట డబ్బింగ్‌ చేసి సినిమాను విడుదల చేయాలని దిల్‌రాజు భావించాడు.

కాని తాజాగా సినిమా చూసిన తర్వాత రీమేక్‌ చేయాల్సిందే అంటూ నిర్ణయించుకున్నాడు.అక్టోబర్‌ 4న తెలుగులో విడుదల చేయబోవడం లేదని తెలుస్తోంది.రీమేక్‌కు సంబంధించిన ఏర్పాట్లు జరిగి పోతున్నాయి.నానికి ఈ చిత్రంను చూపించేందుకు దిల్‌రాజు ప్రయత్నాలు చేస్తున్నాడు..

మరో వైపు దర్శకుడిని కూడా వెదికే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దిల్‌రాజు తీసుకు వచ్చిన ప్రాజెక్ట్‌ అవ్వడంతో నాని ఇప్పటికే సుముకత వ్యక్తం చేసినట్లుగా సమాచారం అందుతుంది.అయితే నాని గతంలో చేసిన రెండు రీమేక్‌లు ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘ఆహా కళ్యాణం’ చిత్రాలు బాక్సాపీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

ఆ రెండు సినిమాలు ఫ్లాప్‌ అయిన కారణంగా నాని మళ్లీ రీమేక్‌ల వద్దకు వెళ్లలేదు.మళ్లీ ఇన్నాళ్లకు దిల్‌రాజు తీసుకు వచ్చాడు కనుక ఈ చిత్రంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దేవదాస్‌’ ప్రమోషన్‌ పనిలో ఉన్న నాని, అక్కడ ‘96’ విడుదలైన తర్వాత చూసి, అక్కడ ఫలితాన్ని బేరీజు వేసుకుని చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటాడు అంటూ ప్రచారం జరుగుతుంది.దిల్‌రాజు మోజు పడ్డ సినిమా కనుక ఖచ్చితంగా బాగానే ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

వచ్చే నెల రెండవ వారంకు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.