నానికి ఘోర అవమానం.. ఫీలవుతున్న ఫ్యాన్స్..?

న్యాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన వి సినిమా గతేడాది సెప్టెంబర్ నెల 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.నాని నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై నెగిటివ్ టాక్ ను మూటగొట్టుకుంది.

 Natural Star Nani V Movie Got Negative Response From Audience, Amazon Prime, Nat-TeluguStop.com

భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా హక్కులు కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ కు భారీగా నష్టం వచ్చినట్టు వార్తలు వచ్చాయి.

కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టీవీల్లో ప్రసారం కాగా టీవీలో కూడా ఈ సినిమాకు పూర్ రేటింగ్స్ వచ్చాయి.

ఓటీటీలో, బుల్లితెరపై డిజాస్టర్ అయిన ఈ సినిమా మూడు రోజుల క్రితం థియేటర్లలో విడుదలైంది.థియేటర్లలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తప్ప మరే సినిమా ఆడకపోవడంతో కొందరు థియేటర్ల ఓనర్లు వి సినిమాను తమ థియేటర్లలో విడుదల చేశారు.

అయితే ఈ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ఏ మాత్రం ఆసక్తి చూపలేదని సమాచారం.

Telugu Rupees, Amazon Prime, Dil Raju, Disaster Tv, Harish Paddy, Nani, Nani Fan

వి సినిమా రెండు రోజుల కలెక్షన్లు కేవలం 8 లక్షల రూపాయలు అని సమాచారం.ఇంత తక్కువ మొత్తంలో కలెక్షన్లు రావడం నానికి అవమానమే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఓటీటీల్లో, టీవీలో ఫ్లాప్ అయిన సినిమాను థియేటర్లలో విడుదల చేయడంపై నాని ఫ్యాన్స్ కూడా ఫీలవుతున్నారు.

మరోవైపు నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

హరీష్ పెద్ది, సాహూ గారపాటి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ ఏడాది ఏప్రిల్ లో సినిమా విడుదల కానుంది.

శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube