నాని 'శ్యామ్‌ సింగరాయ్‌' ఫస్ట్‌ లుక్‌ టాక్‌, సినిమా అంచనాలు పీక్స్‌కు

నాని హీరోగా ట్యాక్సీవాలా ఫేమ్‌ రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్‌ సింగరాయ్ సినిమా ఫస్ట్‌ లుక్ విడుదల అయ్యింది.నాని పుట్టిన రోజు సందర్బంగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్ అనుకున్నదాని కంటే అదరహో అన్నట్లుగా ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఇంకా నాని అభిమానులు బలంగా అంటున్నారు.

 Hero Nani Shyam Singha Roy First Look-TeluguStop.com

పెద్ద ఎత్తున శ్యామ్‌ సింగరాయ్ సినిమాను దర్శకుడు రాహుల్‌ తెరకెక్కిస్తున్నాడు.నాని గతంలో ఎప్పుడు కనిపించని విభిన్నమైన గెటప్‌ లో విలక్షణమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

పెద్ద ఎత్తున ఈ సినిమా గురించి మీడియాలో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సినిమా పై ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్నారు.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఫస్ట్‌ లుక్ తో క్లారిటీ వచ్చేసింది.

 Hero Nani Shyam Singha Roy First Look-నాని శ్యామ్‌ సింగరాయ్‌’ ఫస్ట్‌ లుక్‌ టాక్‌, సినిమా అంచనాలు పీక్స్‌కు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శ్యామ్‌ సింగరాయ్ పీరియాడిక్‌ మూవీ అంటూ మొదటి నుండి ప్రచారం జరిగింది.ఫస్ట్‌ లుక్‌ చూసిన తర్వాత అది నిజమే అని తేలిపోయింది.ఇక నాని ఈ సినిమాలో విభిన్నమైన గెటప్‌ లో కనిపించబోతున్నాడు అన్నారు.అన్నట్లుగానే కాస్త వైవిధ్యభరితంగా కనిపించడంతో పాటు ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ ను కూడా నాని కలిగి ఉండబోతున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ను తుది దశకు తీసుకు వచ్చారు.ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

పోస్టర్‌ లో నాని ని వెనుక నుండి అమ్మాయి చేతులు కౌగిలించుకోవడం, నాని హుందాగా నిల్చోవడం జరిగింది.కాని వెనుక ఉన్న అమ్మాయి ఎవరు అనేది మాత్రం చూపించలేదు.

నాని అలా అమ్మాయి చేతులను మేకప్ గా ధరించాడా లేదంటే వెనుక అమ్మాయి ఉందా అనేది ఆసక్తికరంగా ఉంది.మొత్తానికి సినిమాపై అంచనాలు పీక్స్‌ లో ఉన్నాయి.

#ShyamSingha #Rahul #Nani #Nani Film News #ShyamSingha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు