జన్మలో టీవీ హోస్ట్ గా చెయ్యను.. నాని షాకింగ్ నిర్ణయం?

నాచురల్ స్టార్ నాని సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా నటిస్తూ ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలతో పెద్ద బిజీగా గడుపుతున్నారు.నాని కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించారు.

 Hero Nani Shocking Comments On Tv Hosting-TeluguStop.com

ఈ రియాలిటీ షో తర్వాత నాని ఏ విధమైనటువంటి కార్యక్రమాలలో, ఎలాంటి రియాల్టీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించలేదు.కేవలం తన దృష్టి మొత్తం సినిమాల పై ఉంచి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నానికి బుల్లితెర పై మరోసారి కనిపించే అవకాశం ఉందా? అన్న ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు నాని స్పందిస్తూ “ఇకపై ఎప్పుడూ కూడా టీవీలో కనిపించను.

 Hero Nani Shocking Comments On Tv Hosting-జన్మలో టీవీ హోస్ట్ గా చెయ్యను.. నాని షాకింగ్ నిర్ణయం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అలాంటి ప్లాన్స్ ఏమీ లేవని ఇది వరకే తెలియజేశాను అంటూ” సమాధానం చెప్పుకొచ్చారు.అదేవిధంగా తను ఉదయం నిద్ర లేచినప్పటినుంచి పడుకునే వరకు సినిమా గురించి ఆలోచిస్తానని, అలాంటి నాకు బిగ్ బాస్ గురించి ఆలోచించాలంటే భారం అవుతుందని ఈ కార్యక్రమాన్ని నాకన్న నాగార్జున గారు ఎంతో సమర్థవంతంగా చేస్తున్నారంటూ నాని తెలియజేశారు.

Telugu Bigg Boss Season 2, Hero Nani, Nagarjuna, Nani About Tv Hosting, Nani Host, Nani Interview, Posts, Shocking Comments, Social Media, Telugu Bigg Boss, Tollywood, Tv Hosting-Movie

అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించినందుకు తనకు సహనం ఎంతో నేర్పిందని, అది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన అనుభవం అంటూ నాని తెలియజేశారు.ఇప్పటికీ ఈ షో ప్రారంభమవుతున్న సమయంలో చాలామంది మళ్లీ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా ఎప్పుడు చేస్తారంటూ మెసేజీలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఇంటర్వ్యూ సందర్భంగా నాని వెల్లడించారు.

#Nani Interview #Nagarjuna #Nani Tv #Tv #Nani

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు