యాంకర్ ఝాన్సీ కి స్టేజిపైనే షాక్ ఇచ్చిన హీరో నాని?

టాలీవుడ్ ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టి హీరోగా వరుస అవకాశాలను అందిపుచ్చుకొని తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తాజాగా నాని సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన “తిమ్మరుసు“చిత్రం ఈ నెల 30వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

 Nani Shocking Comments On Anchor Jhansi At Thimmarusu Pre Release Event,  Thimma-TeluguStop.com

ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదు.కానీ థియేటర్లు తెరచుకోవాలంటే కరోనా ఆంక్షలు అడ్డు వస్తున్నాయి.బార్లకు, మద్యం షాపులకు అడ్డురాని ఆంక్షలు సినిమా థియేటర్లు ఎందుకంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇక తన స్పీచ్ లో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నటువంటి యాంకర్ ఝాన్సీ గురించి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Anchor Jhansi, Nani, Satyadev, Thimmarusu, Thimmarusu Pre, Tollywood-Movi

ఇండస్ట్రీలోకి రాకముందు ఝాన్సీ అక్కతో బాగా పరిచయం ఉండేది.ఒక రోజు అక్క ఇంటికి వెళ్లి కలిసాను.అయితే అప్పటికి ఇంకా నేను నా కెరీర్ ని మొదలు పెట్టలేదు.

ఈ క్రమంలోనే సినిమాలలోకి వచ్చి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా అక్కా…అని చెప్పడంతో అప్పుడు అక్క సినిమాలు నీకెందుకురా.? అని అన్నారు.కానీ ఇప్పుడు అక్కను ఎప్పుడు కలిసినా తనకు ఎంతో గర్వంగా ఉంటుందని ఈ సందర్భంగా స్టేజీపైనే నాని యాంకర్ ఝాన్సీ కి షాక్ ఇచ్చారు.

Telugu Anchor Jhansi, Nani, Satyadev, Thimmarusu, Thimmarusu Pre, Tollywood-Movi

స్టేజ్ మీద ఝాన్సీ గురించి నాని ఆవిధంగా చెప్పడంతో ఝాన్సీ మొహం పక్కకి తిప్పుకుని వెరైటీ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు.అయితే ఝాన్సీ గురించి నాని ఉద్దేశపూర్వకంగా అన్నారా.? లేక వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఇలా కామెంట్ చేశారా? అన్న డైలమాలో యాంకర్ ఝాన్సీ ఉండిపోయిందని అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube