ఆమెకి అన్నీ డౌట్లే.. సాయిపల్లవి క్యారెక్టర్ రివీల్ చేసిన నాని!

స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మైథిలి అనే పాత్రలో దేవదాసిగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా శుక్రవారం రోజున థియేటర్లలో రిలీజ్ కానుంది.సాయిపల్లవి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 Hero Nani Shocking Comments About Heroine Saipallavi Details, Nani, Sai Pallavi,-TeluguStop.com

సెప్టెంబర్ 24వ తేదీన లవ్ స్టోరీ రిలీజ్ కాగా అదే తేదీన డిసెంబర్ నెలలో శ్యామ్ సింగరాయ్ రిలీజవుతూ ఉండటం గమనార్హం.లవ్ స్టోరీ సక్సెస్ సెంటిమెంట్ శ్యామ్ సింగరాయ్ తో రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఎంసీఏ తర్వాత నాని, సాయిపల్లవి శ్యామ్ సింగరాయ్ సినిమా కోసం కలిసి నటించారు.తాజాగా నాని సాయిపల్లవి గురించి మాట్లాడుతూ సాయిపల్లవికి అన్నీ డౌట్లేనని అన్నారు.

తాను సరిపోయానా అని సాయిపల్లవి ఆలోచిస్తుందని డ్యాన్సర్లు ప్రొఫెషనల్ అని తాను ప్రొఫెషనల్ కాదని ఆమె అనుకుంటుందని నాని చెప్పుకొచ్చారు.అయితే చివరకు సాయిపల్లవి వాళ్ల కంటే చాలా బాగా చేస్తుందని నాని వెల్లడించారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు శ్యామ్ సింగరాయ్ సినిమాకు పాటలు రాయడం అదృష్టమో దురదృష్టమో తెలియడం లేదని నాని చెప్పుకొచ్చారు.

Telugu Krishna Vamshi, Nani, Krithi Shetty, Saipallavi, Tollywood-Movie

తనకు ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉందని పైసా సినిమా షూటింగ్ సమయంలో ఆయన తనకు కాల్ చేశారని నాని వెల్లడించారు.ఆయన నన్ను మెచ్చుకోవడంతో వెంటనే అక్కవాళ్లకు కాల్ చేసి ఆయన ఏ విధంగా మెచ్చుకున్నారో పంచుకున్నానని నాని పేర్కొన్నారు.

Telugu Krishna Vamshi, Nani, Krithi Shetty, Saipallavi, Tollywood-Movie

తన మనవరాలు నాకు పెద్ద ఫ్యాన్ అని ఇంటికి ఎప్పుడు వస్తావని సిరివెన్నెల సీతారామశాస్త్రి అడిగేవారని నాని చెప్పుకొచ్చారు.పైసా సినిమా చూసిన తర్వాత కృష్ణవంశీకి  రాయి దొరికితే రత్నంలా మారుస్తాడని ఇక రత్నమే దొరికితే అని సీతారామశాస్త్రి అన్నారని నాని కామెంట్లు చేశారు.శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని, సాయిపల్లవి ఖాతాలో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube