హీరో నాని సినిమాలకు ముందు ఆ పని చేశాడని మీకు తెలుసా?

టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట అష్టా చమ్మా సినిమాతో ప్రేక్షకులను అలరించాడు నాని.

 Hero Nani Says I Did Not Achieve Success Overnight , Nani , Over Night , Tollywood , Intersting Comments,radhagopalam Movie,bapu,radio Jockey,ashta Chamma Movie-TeluguStop.com

ఆ తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.ఈ సినిమా తర్వాత తెలుగులో రైడ్,స్నేహితుడా, అలా మొదలైంది, ఈగ, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, పిల్ల జమిందార్, బలే బలే మగాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు నాని.

అయితే హీరో నానిని చూడగానే పక్కింటి ఉన్నాడు అన్న ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది.కాగా హీరో నాని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాలు పూర్తి అయింది.

 Hero Nani Says I Did Not Achieve Success Overnight , Nani , Over Night , Tollywood , Intersting Comments,Radhagopalam Movie,Bapu,Radio Jockey,Ashta Chamma Movie-హీరో నాని సినిమాలకు ముందు ఆ పని చేశాడని మీకు తెలుసా-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా నాని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.2005లో రాధాగోపాలం సినిమాకు దర్శకుడు బాపుతో కలిసి పని చేశాను.మొదట నేను మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలి అనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాను.

ఇండస్ట్రీ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను అని తెలిపారు నాని.

Telugu Ashta Chamma, Bapu, Nani, Radhagopalam, Radio Jockey, Tollywood-Latest News - Telugu

ఈ క్రమంలోనే కొద్ది రోజులు రేడియో జాకి గా పని చేశాను.ఆ తర్వాత కొన్ని ప్రకటనలలో నటించే అవకాశాలు వచ్చాయి.ఆపై 2008లో విడుదలైన అష్టా చమ్మా సినిమా నాకెంతో పేరును తెచ్చి పెట్టింది అని చెప్పుకొచ్చాడు నాని.

అయితే ఇదంతా కూడా నాకు కేవలం ఒక రాత్రిలో వచ్చింది కాదు.ఈరోజు ఈ స్టేజ్ లో ఉండడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను.నేను చేసే ప్రతి పనిలో నా బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.ఈరోజు ఇంతమంది అభిమానుల ప్రేమ, అప్యాయతలు నాకు దక్కుతున్నాయంటే నిజంగా నేను అదృష్టవంతుడిని అనుకుంటాను అని చెప్పుకొచ్చారు నాని.

ఇక చివరిగా నాని అంతే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube