కాజల్‌ ఆంటీతో నేను నటించనన్న యంగ్‌ హీరో  

Hero Nani Rejected Kajal Agarwal-

కాజల్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యి దాదాపు పుష్కర కాలం అవుతుంది. ఈ అమ్మడు మొదటి సినిమాతో అంతగా ఆకట్టుకోలేక పోయినా, ఆ తర్వాత సినిమాలు ‘చందమామ’ మరియు ‘మగధీర’ చిత్రాలతో టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆరెండు సినిమాల తర్వాత ఈమెకు దక్కిన అవకాశాల్లో ఎక్కువ శాతం స్టార్‌ హీరోల సినిమాలు అవ్వడం, అవి కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం వంటివి జరిగింది..

కాజల్‌ ఆంటీతో నేను నటించనన్న యంగ్‌ హీరో-Hero Nani Rejected Kajal Agarwal

టాలీవుడ్‌లోని దాదాపు యువ స్టార్‌ హీరోలందరితో రొమాన్స్‌ చేసిన కాజల్‌కు ప్రస్తుతం రొమాన్స్‌కు స్టార్‌ హీరో లేడు. దాంతో ఈమెకు స్టార్‌ హీరోల సరసన ఛాన్స్‌లు తక్కువ అయ్యాయి.

స్టార్‌ హీరోలు తనను పక్కకు పెట్టినా కూడా తన స్టార్‌డంను కాపాడుకుంటూ చిన్న హీరోలు అయిన రానా, శర్వానంద్‌, బెల్లంకొండ వంటి హీరోలతో పని కానిచేస్తోంది. తాజాగా ఈమెను నానికి జోడీగా నటింపజేయాలని మైత్రి మూవీస్‌ వారు భావించారు.

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నాని హీరోగా మైత్రి మూవీస్‌లో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రంకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఆ చిత్రంలో కాజల్‌ను హీరోయిన్‌గా అనుకున్నారు..

మైత్రి మూవీస్‌ వారి వద్ద కాజల్‌ డేట్లు చాలా కాలంగా అలాగే ఉంటున్నాయి. ఆ కారణంగా నానికి ఆమెను సెట్‌ చేస్తే ఒక పనైపోతుందని మైత్రి వారు భావించారు. కాని నాని మాత్రం అందుకు ఓకే చెప్పడం లేదు.

కాజల్‌ తో నటించడం నాకు ఇష్టం లేదు అంటూ తేల్చి చెప్పాడు. కాజల్‌తో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాని ఆ సన్నిహిత సంబంధాల కారణంగా సినిమాలో ఆమెతో రొమాన్స్‌ చేయలేను అంటూ నాని చెప్పుకొచ్చాడు.

కాజల్‌ హీరోయిన్‌గా నా పక్కన నటిస్తే ఏమాత్రం బాగోదని, అసలు ఆమెకు నాకు సూట్‌ అవ్వదని ప్రేక్షకులు ఇబ్బంది ఫీల్‌ అవుతారు అంటూ నాని చెబుతున్నాడు. కాజల్‌ నాకు ఆంటీ లా ఉంటుంది, అందుకే నేను ఆమెతో నటించాలని కోరుకోవడం లేదని, నా సినిమాలో ఏదైనా ముఖ్య పాత్ర ఆమె పోషిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఈ సందర్బంగా నాని చెప్పుకొచ్చాడు.