నాని సినిమా ఆ హాలీవుడ్ సినిమాకు కాపీ.. ఇది కూడా కాపీనా బాబు?

నాని హీరోగా గౌతమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “జెర్సీ”.ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించబోతున్నాడు.

 Hero Nani Jersey Movie Is A Copy Of Hollywood Movie-TeluguStop.com

తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.మూడు పదుల వయసు దాటినా వారు సహజంగా ఆటల నుండి తప్పుకుంటారు.

కానీ ఈ సినిమాలో హీరో మాత్రం మూడు పదుల వయసు దాటినా తర్వాత క్రికెటర్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టి అవమానాలు ఎదుర్కొంటాడు.ఆ వ్యక్తి పడ్డ కష్టాలు ఏంటి అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు.

అచ్చు ఇలాంటి కథతో హాలీవుడ్ లో ఇప్పటికే “ఇన్విన్సిబుల్” అనే సినిమా వచ్చింది.ఆ సినిమాలో హీరో 30 ఏళ్ల వయసులో ఫుట్ బాల్ ప్లేయర్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు.ఆ ప్రయత్నాల్లో అతడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, అసలు అంత లెట్ గా ఆ వ్యక్తికి ఫుట్ బాల్ పై ఎందుకు మోజు ఏర్పడింది అనేది సినిమా కథ.ఇప్పుడు అదే కథ జెర్సీకి అనువాదించుతున్నట్లుగా తెలుస్తుంది.

హాలీవుడ్ సినిమా కు జెర్సీ కాపీ అంటూ వార్తలు వస్తున్న నేపధ్యలో చిత్ర యూనిట్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి.హాలీవుడ్ సినిమాలను ఇన్సిపిరేషన్ గా తీసుకుని చాలా సినిమాలు వస్తున్నాయి.అదే జాబితాలో ఇది కూడా అంటూ కొందరు సినీ ప్రేమికులు నిట్టూర్చుతున్నారు.నాని ఈ సినిమాను ఎంపిక చేసుకున్నాదంటే ఖచ్చితంగా మ్యాటర్ ఉండి ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.

ఏప్రిల్ లో సినిమా విడుదల చేయబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube