ఉదయ్ కిరణ్ గా నేచురల్ స్టార్ నాని

ఉదయ్ కిరణ్ ఈ పేరు వినగానే అభిమానులు ఇట్టే చెప్పేస్తారు.ఒకప్పుడు టాలీవుడ్ లో లవర్ బాయ్ గా దూసుకెళ్లిన నటుడు అని.

 Hero Nani Is Doing Udaykiran Role In His Biopic-TeluguStop.com

తేజ డైరెక్షన్ లో వచ్చిన ‘చిత్రం’ సినిమా తో తన కెరీర్ ని ప్రారంభించిన ఉదయ్ ఆ తరువాత వెనకకు తిరిగి చూసుకోలేదు.అతడి కెరీర్ కూడా అలానే ముందుకు సక్సెస్ ఫుల్ గా సాగిపోయింది.

అయితే టాలీవుడ్ లో లవర్ బాయ్ గా ఒక్క ఊపు ఊపిన ఉదయ్ ఆ తరువాత పర్సనల్,ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ తో ఒక్కసారిగా కిందకు పడిపోయాడు.నిజంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగి తనకంటూ ఒక స్టార్ డమ్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.

అలాంటి కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో అతడి పెళ్లి విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అతడి ఒక్కసారిగా డిప్రెషన్ కు గురయ్యాడు.దీనితో చివరికి అతడు ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలను పోగుట్టుకున్నాడు.

అతడు మృతి చెంది అప్పుడే 5 సంవత్సరాలు కూడా అయిపోతుంది.అయితే ఇప్పుడు ఉదయ్ బయోపిక్ తీస్తున్నారు అన్న రూమర్స్ మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.

గతంలో తేజ దర్శకత్వంలోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ అంటూ ప్రచారం జరుగగా, ఆ వార్తలను తేజ కొట్టిపారేశారు.అయితే ఇప్పుడు తాజాగా ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సందీప్ అనే వ్యక్తి ఈ బయోపిక్ ని డైరెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Telugu Naniudaykiran, Nani, Sandeep Kishan, Teja Uday Kiran, Teja, Udaykiran-

అయితే ఈ చిత్రంలో ఉదయ్ గా సందీప్ కిషన్ ని ఎంచుకున్నట్లు వార్తలు రాగా, ఇప్పుడు ఈ వార్తను పక్కన పెట్టి మరో హాట్ న్యూస్ హల్ చల్ చేస్తుంది.అదేంటంటే ఈ బయోపిక్ లో నేచురల్ స్టార్ నాని నటిస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.నాని కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లో అడుగుపెట్టి స్టార్ హీరో గా ఎదిగిన విషయం తెలిసిందే.అయితే ఈ విషయంలో ఇద్దరికీ సిమిలారిటీస్ ఉండడం తో ఈ క్యారెక్టర్ కు నాని అయితే న్యాయం చేయగలడు అని అందుకే ఈ క్యారెక్టర్ కోసం నాని ని ఎంచుకున్నట్లు వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి.

ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ సందీప్‌ను అప్రోచ్ అయిన మాట వాస్తవమే కానీ.అతడు ఆ పాత్రలో నటించేందుకు సంసిద్దంగా లేడట.అందుకే ఇప్పుడు నాని పేరు తెరపైకి వచ్చింది.మరి ఈ బయోపిక్ కి నాని ఒకే అంటాడో లేదో అన్నది తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube