భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని.. ఆ ఫోటోలు షేర్ చేస్తూ?

Hero Nani Interesting Comments On His Wife Anjana

న్యాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు సక్సెస్ సాధించకపోయినా నానికి సినిమా ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఏకంగా 50 కోట్ల రూపాయలు ఖర్చు అయింది.

 Hero Nani Interesting Comments On His Wife Anjana-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన శ్యామ్ సింగరాయ్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా ఈ సినిమాతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని సోషల్ మీడియాలో నాని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఎంసీఏ సినిమా తరువాత నాని, సాయిపల్లవి కలిసి శ్యామ్ సింగరాయ్ లో నటిస్తున్నారు.

 Hero Nani Interesting Comments On His Wife Anjana-భార్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాని.. ఆ ఫోటోలు షేర్ చేస్తూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాలో మరో హీరోయిన్ రోల్ లో కృతిశెట్టి నటిస్తున్నారు.ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు సంపాదించుకున్న కృతిశెట్టి ఇప్పటికే వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.

శ్యామ్ సింగరాయ్ సక్సెస్ సాధిస్తే కృతిశెట్టి స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరుతారని చెప్పవచ్చు.ఈ మధ్య కాలంలో నాని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

భార్య పుట్టినరోజు సందర్భంగా నాని “మదర్ ఆఫ్ డ్రాగన్ వైఫ్ ఆఫ్ పాండా సెంటర్ ఆఫ్ అవర్ హోమ్” అంటూ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.ఇన్ స్టాగ్రామ్ వేదికగా నాని షేర్ చేసిన ఈ పోస్ట్ కు 7 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

నాని భార్య, కొడుకుతో దిగిన ఫోటోలను సైతం ఈ సందర్భంగా అభిమానులతో షేర్ చేసుకున్నారు.నాని అంజనా ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాని ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.నాని గత రెండు సినిమాలు ప్రైమ్ లో రిలీజ్ కాగా భవిష్యత్తు సినిమాలను మాత్రం థియేటర్లలో విడుదల చేయాలని నాని భావిస్తున్నారు.నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమాకు ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.

#Anjana #Krithishetti #Nani #Nani #Shyam Singaray

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube