దసరా షూటింగ్ సెట్లో నానికి తృటిలో తప్పిన ప్రమాదం?

సినిమా ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం అష్టాచమ్మా సినిమాతో హీరోగా పరిచయమయ్యారు నాచురల్ స్టార్ నాని. ఈ సినిమా మంచి విజయం సాధించిన అనంతరం ఈయన వరుస సినిమాలతో ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

 Hero Nani Injured In Dasara Movie Shooting Details, Nani,tollywood,dushera,telan-TeluguStop.com

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో నాని కూడ ఒకరు.తాజాగా ఈయన అంటే సుందరానికి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ సినిమా అనంతరం నాని దసరా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.

బొగ్గు గనుల నేపథ్యంలో తెరకేకుతున్న ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని బొగ్గు గనిలో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో అనుకోకుండా నాని బొగ్గు లారీ కింద ప్రమాదానికి గురయ్యారు.సినిమా షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా లారీలో ఉన్న బొగ్గు మొత్తం నాని మీద పడటంతో ఒక్కసారిగా చిత్ర బృందం ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Telugu Dasara, Srikanth Odela, Dushera, Nani, Keerthy Suresh, Telanagna, Tollywo

ఇక నాని ఇలాంటి ప్రమాదానికి గురవడంతో చిత్ర బృందం కాసేపు షూటింగ్ ఆపివేశారు.అనంతరం నాని తయారైన తర్వాత తిరిగి యధావిధిగా షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇందులో నాని సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube