ప్రయోగం చేస్తున్న నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో వి అనే సినిమాలో నటిస్తున్నాడు.అయితే ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని విధంగా నెగిటివ్ పాత్రలో నాని కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

 Hero Nani Gang Leader Movie Creage In His Fans-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ అనే సినిమాని రానున్న ఏడాదిలో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు.ఈ సినిమాతో మరోసారి క్లాస్ టచ్ ని ఇవ్వనున్న నాని తరువాత మాత్రం ఇప్పటి వరను లేని విధంగా ఓ కొత్త దర్శకుడుతో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఈ మధ్య కృష్ణార్జున యుద్ధం, దేవదాసు సినిమాలతో వరుస ఫ్లాప్ లు కొట్టిన నాని జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అనుకున్న స్థాయిలో మార్కెట్ లోకి వెళ్ళలేదు.మళ్ళీ వెంటనే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.

అయితే ఈ సినిమా కూడా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.నాని నమ్మకం అంతా ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీదనే ఉంది.అయితే ఊహించని విధంగా ఓ డిఫరెంట్ స్టొరీ అది కూడా క్రిష్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన శ్రీకాంత్ అనే యువకుడు దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే నిన్నుకోరీ సినిమాతో శివ నిర్వాణకి అవకాశం ఇచ్చి హిట్ కొట్టినట్లు ఈ శ్రీకాంత్ తో కూడా హిట్ కోడతాదేమో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube