అప్పట్లో అలాంటివి నాగార్జున గారికి పడ్డాయ్...ఇప్పుడు చైతూకి.! అక్కినేని ఫ్యామిలీకి అలా రాసుందన్న నాని.!  

“శైలజ రెడ్డి అల్లుడు”..మారుతీ దర్శకత్వంలో నాగ చైతన్య, అను ఎమాన్యూల్ జంటగా తెరకెక్కిన చిత్రం. ఇందులో చైతూకి అత్తగా రమ్య కృష్ణ గారు నటించడం ఈ సినిమాకి పెద్ద ప్లస్. సాధారణంగా మారుతీ సినిమాలు కంటే కామెడీకి సంబంధించినవే ఉండటంతో ఈ సినిమా కూడా వినోదం పంచడం పక్కా అనుకుంటున్నారు సినిమా అభిమానులు.ఇది ఇలా ఉండగా…ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఆదివారం నాడు నిర్వహించారు. ఈ వేడుకలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, అను ఇమ్మానుయేల్, రమ్యక్రిష్ణ, నరేష్ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిధిగా నాని వచ్చారు.

Hero Nani Comments On Akkineni Family-

Hero Nani Comments On Akkineni Family

ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ.. ‘శైలజా రెడ్డి అల్లుడు’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కి నేను రావడానికి ఒక కారణం మారుతి, వంశీ అయితే రెండో కారణం నాగార్జున గారు అని చెప్పారు. మారుతీ తో నాని కి ఉన్న అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన భలే భలే మొగాడివోయ్ చిత్రమే దీనికి సాక్షం. నాగార్జున తో కలిసి ‘దేవదాస్’ సినిమా చేశా. ఆ మూవీ షూటింగ్ అయిపోయింది. ఆయన్ని కలుసుకునేందుకు వచ్చేశా. అని చెప్పేసాడు నాని.

Hero Nani Comments On Akkineni Family-

నాగార్జున గారి జనరేషన్‌లో ఆయనకే మంచి పాటలు పడేవి. మా జనరేషన్‌లో బెస్ట్ సాంగ్స్ అన్నీ చైతూకే పడుతున్నాయి. అక్కినేని ఫ్యామిలీకి మంచి పాటలన్నీ రాసి ఉన్నాయి. ‘దేవదాస్’ సినిమా షూటింగ్‌లో నాగార్జున గారు.. ఈ సినిమా ‘అల్లరి అల్లుడు’ లాంటి సినిమా అని అన్నారు. అంతకంటే మనకి ఏంకావాలి. గోపీ సుందర్ గారితో మూడు సినిమాలు పనిచేశా. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’ అన్నారు నాని.