గ్యాంగ్ లీడర్ లో నాని క్యారెక్టర్ ఏమిటంటే  

Hero Nani Character In The Gang Leader Movie-

విభిన్న పాత్రల తో రోజు రోజుకు ప్రేక్షకులకు మరింత దగ్గరౌతున్న నేచురల్ స్టార్ నాని ఇటీవల జెర్సీ తో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.సైలెంట్ గా చిత్రాలను చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని తాజగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వం లో గ్యాంగ్ లీడర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.

Hero Nani Character In The Gang Leader Movie--Hero Nani Character In The Gang Leader Movie-

అయితే నాని పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్ లుక్ ను,టీజర్ ను ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు.ఈ చిత్రంలో నాని ఐదుగురు అమ్మాయి లకు లీడర్ గా కనించనున్నాడట.అయితే ఆ ఐదుగురు కూడా దొంగలుగా క్యారెక్టర్స్ చేస్తున్నట్లు తెలుస్తుంది.అంటే నాని ఐదుగురు దొంగలకు లీడర్ గా గ్యాంగ్ లీడర్ గా వ్యవహరిస్తున్నాడు అన్నమాట.

ప్రతి చిత్రం లాగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనున్నట్లు తెలుస్తుంది.మరోపక్క ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో కూడా నాని ఒక చిత్రం చేస్తున్న సంగతి విదితమే.

అయితే ఈ చిత్రంలో మరో హీరో సుదీర్ బాబు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది.విభిన్న కద తో చిత్రాన్ని తెరకెక్కించే ఇంద్రగంటి ఈ చిత్రం లో ఎలాంటి ఎక్స్ పరమెంట్ చేయబోతున్నారో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.