కౌశల్‌ను విజేతగా ప్రకటించడం నానికి అస్సలు ఇష్టం లేదట

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచిన విషయం తెల్సిందే.నాని హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌ బాస్‌ సీజన్‌ 2కు మంచి టీఆర్పీ రేటింగ్‌ దక్కింది.

 Hero Nani About Bigg Boss Telugu 2 Kaushal-TeluguStop.com

అయితే ఆ టీఆర్పీ రేటింగ్‌కు కారణం కౌశల్‌ ఆర్మీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.షో మొత్తం కౌశల్‌ ఆర్మీ చెప్పినట్లుగానే సాగింది.

సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు భయపడి నాని కూడా కౌశల్‌ను కాని, ఆయనకు సన్నిహితులను కాని ఏమనలేక పోయాడు.మొత్తానికి కౌశల్‌ ఆర్మీ వల్ల కౌశల్‌ విజయం సాధించాడు.

అయితే ఆ విషయాన్ని బాబు గోగినేని ఎంతకూ ఒప్పుకోవడం లేదు.

షో పూర్తి అయినప్పటి నుండి కూడా బాబు గోగినేని వరుసగా కౌశల్‌పై విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెల్సిందే.కౌశల్‌ది న్యాయబద్దమైన గెలుపు కాదని, అతడు ఫేక్‌ ఓట్ల ద్వారా బిగ్‌ బాస్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు అంటూ విమర్శలు చేస్తూ వచ్చాడు.తాజాగా ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా కౌశల్‌పై బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఈసారి వివాదంలోకి నానిని కూడా లాగాడు.కౌశల్‌ను విజేతగా ప్రకటించడం తనకు అస్సలు ఇష్టం లేదని, కాని నిర్వాహకుల నిర్ణయాన్ని తాను పాటించాల్సి వస్తుందంటూ నాని తమతో చెప్పినట్లుగా బాబు గోగినేని అన్నాడు.

కౌశల్‌ను విజేతగా ప్రకటించడం ఇష్టం లేకే ఎప్పుడు బిగ్‌ బాస్‌ విన్నర్‌ను ప్రకటించినట్లుగా కాకుండా వేరే విధంగా ప్లాన్‌ చేశారు.సహజంగా బిగ్‌ బాస్‌ ఫైనల్స్‌కు చేరుకున్న ఇద్దరిని రెండు చేతులతో హోస్ట్‌ పట్టుకుని, వారిలోంచి ఒకరిని విజేతగా ప్రకటిస్తూ చేయి పైకి లేపాల్సి ఉంటుంది.కాని నాని మాత్రం అలా ప్రకటించేందుకు ఒప్పుకోలేదు.అలా నాని ఎందుకు నో చెప్పాడో మీరే అర్థం చేసుకోవచ్చు అంటూ బాబు గోగినేని సంచలన ఆరోపణలు చేశాడు.

అంటే కౌశల్‌కు వచ్చినవి ఫేక్‌ ఓట్లు అని నాని అభిప్రాయ పడ్డాడా అనేది నాని మాట్లాడితే కాని తెలియదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube