కళ్యాణ్ రామ్ 'బింబిసార' పై ట్రోల్స్‌.. ఖైదీ, మగధీర కలయిక

నందమూరి కళ్యాణ్ రామ్‌ బింబిసార అనే సినిమాను నిన్న అన్నగారు ఎన్టీఆర్‌ జయంతి సందర్బంగా ప్రకటించిన విషయం తెల్సిందే.బింబిసార అనే రాజు చరిత్రలో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తి.

 Hero Nandamuri Kalyan Ram Bimbisara Trolls , Bimbisara, Film News, Kalyan Ram, N-TeluguStop.com

ఆయన గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఆయన చెడు గురించి చాలా మంది చెబుతూ ఉంటారు.

కాని మంచి కూడా ఉందని కొందరు అంటూ ఉంటారు.చరిత్రలో కొద్ది గొప్ప కనిపించినా కూడా అది బింబిసార గురించి చెడు మాత్రమే చెబుతుంది.

కాని కొందరు చరిత్ర కారులు మాత్రం బింబిసార గురించి వేరు వేరు చోట్ల వేరు వేరు రకాలుగా చెప్పడంతో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కు ఆయనపై ఆసక్తి కలిగిందట.ఒక మంచి సినిమాను ఆయన కథతో తీయవచ్చు అనే ఉద్దేశ్యంతో బింబిసార అనే టైటిల్‌ తో కల్పిత కథతో యదార్థ పాత్రలతో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.

ఈ సినిమా చిత్రీకరణ ఏమో కాని ఇప్పుడు ఈ సినిమా గురించి మీమ్స్ సోషల్‌ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్‌ లుక్‌ కాస్త అటు ఇటుగా మగధీర సినిమాలో మాదిరిగా ఉంది.

మగధీర సినిమాలోని రామ్ చరణ్ ఫొటోలకు కళ్యాణ్ రామ్‌ ఫేస్ ను అద్దినట్లుగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ఈ పోస్టర్ ను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు తెగ షేర్‌ చేస్తున్నారు.

Telugu Bimbisara, Fim, Kalyan Ram, Khaidi, Magadheera, Memes, Nandamuri, Ntr-Mov

నెట్టింట ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.మగధీర లో కళ్యాణ్ రామ్‌ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు యుద్దం చేసిన బింబిసార సైనికుల గుట్ట మీద కూర్చుని ఉంటాడు.అదే స్టిల్ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమాలో కూడా ఉంది.చిరంజీవి శవాల గుట్ట మీద కూర్చున్న ఫొటో అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.అలాంటి పోస్టర్‌ ను మళ్లీ ఇప్పుడు తీసుకు వచ్చి బింబిసారా అంటున్న నందమూరి కళ్యాణ్ రామ్‌ ను కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆటాడేసుకుంటున్నారు.

మరి సినిమా వచ్చిన తర్వాత అయినా పరిస్థితి మారుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube