బంగార్రాజు విషయంలో నాగార్జున భయపడుతున్నారా..?

2016 సంవత్సరంలో నాగార్జున డ్యూయల్రోల్ లో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, బాలకృష్ణ డిక్టేటర్, శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో పోటీ పడి ఏకంగా 50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించి అసలైన పండగ సినిమా అనిపించుకుంది.

 Hero Nagarjuna Worried About Bangarraju Movie Release Date ,bangarraju Movie, H-TeluguStop.com

ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా రిలీజ్ డేట్ నాగార్జునను టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడానికి దసరా, సంక్రాంతి, సమ్మర్ మాత్రమే సరైన సీజన్లు అని చెప్పాలి.బంగార్రాజు సినిమాను దసరా పండుగకు విడుదల చేద్దామంటే ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా దసరా పండుగకు విడుదల కానుంది.2022 సంక్రాంతి పండుగకు మహేష్ సర్కారు వారి పాట సినిమాతో పాటు పవన్ క్రిష్ సినిమా కూడా విడుదల కానుంది.

2022 సమ్మర్ లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ సినిమా, ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా, బన్నీ కొరటాల శివ సినిమా విడుదల కానున్నాయి.బంగార్రాజు విషయం నాగార్జును టెన్షన్ పెడుతుందని తెలుస్తోంది.ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని నాగార్జున బంగార్రాజు సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న వైల్డ్ డాగ్ సినిమా వచ్చే నెలలో విడుదలవుతున్నా ఈ సినిమా ఏ సెంటర్ ఆడియన్స్ ను మాత్రమే మెప్పించే అవకాశాలు ఉన్నాయి.

Telugu Bangarraju, Nagarjuna, Wild Dog-Movie

ఏప్రిల్ నెల 2వ తేదీన వైల్డ్ డాగ్ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.రేపు ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

మొదట నాగార్జున ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలని భావించగా థియేటర్ల వైపు ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండటంతో నాగార్జున ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube