వైల్డ్ డాగ్ తొలిరోజు కలెక్షన్లు అంత తక్కువా..?

సోగ్గాడే చిన్నినాయన బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నాగార్జున నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.నాగార్జున గత సినిమా మన్మథుడు 2 ఫ్లాప్ కావడంతో పాటు నాగార్జున పాత్ర విషయంలో కూడా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి.

 Hero Nagarjuna Wild Dog Movie First Day Collection Details, 3 Crores 50 Lakh Rup-TeluguStop.com

అయితే నిన్న విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాకు మాత్రం క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడం గమనార్హం.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వైల్డ్ డాగ్ సినిమాకు 7 కోట్ల 70 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

స్టార్ హీరో నాగార్జున నటించినప్పటికీ ఈ సినిమాలో కమర్షియల్ అంశాలు ఎక్కువగా లేకపోవడంతో ఈ చిత్రానికి నిర్మాతలు ఆశించిన స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు.ఇతర రాష్ట్రాలతో కలిపి 9 కోట్ల రూపాయల టార్గెట్ తో రిలీజైన వైల్డ్ డాగ్ తొలిరోజు దాదాపుగా 3 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది.

Telugu Rupees, Break, Day, Wild Dog-Movie

తొలిరోజే భారీ మొత్తంలో కలెక్షన్లను రాబట్టినా నాగార్జున రేంజ్ కు ఈ కలెక్షన్లు తక్కువ మొత్తమేనని చెప్పాలి.వచ్చే వారం వకీల్ సాబ్ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో వారం రోజుల్లోనే వైల్డ్ డాగ్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంది.వైల్డ్ డాగ్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ సినిమా ఫలితంపై ఒక అంచనాకు రావచ్చు.ప్రస్తుతం నాగ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు.

వైల్డ్ డాగ్ ప్రమోషన్లలో భాగంగా బంగార్రాజు సినిమాలో కూడా నటిస్తానని చెబుతున్న నాగార్జున ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో మాత్రం చెప్పలేకపోతున్నారు.కళ్యాణ్ కృష్ణ బంగార్రాజు సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.

సోగ్గాడే చిన్నినాయన ప్రీక్వెల్ అయిన ఈ సినిమాలో నాగచైతన్య కీలక పాత్రలో నటించనున్నారు.షూటింగ్ ఎప్పుడు ప్రారంభమైనా సంక్రాంతికే ఈ సినిమాను రిలీజ్ చేస్తానని నాగార్జున చెబుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube