స్టార్‌డమ్‌ కోసం ఆరాటపడలేదు.. నాగ్ సంచలన వ్యాఖ్యలు..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలంతా బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ ప్రయత్నాలలో కొందరు హీరోలు సక్సెస్ అవుతుంటే మరి కొందరు హీరోలు మాత్రం ఫెయిల్ అవుతున్నారు.

 Nagarjuna Talk About Bollywood Movies And New Stories , Bollywood Movies, Hero-TeluguStop.com

అయితే సీనియర్ స్టార్ హీరో నాగార్జున మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ తెచ్చుకోవాలని ఆరాటపడటం లేదు.నాగార్జున నటించి ఈ నెలలో విడుదలైన వైల్డ్ డాగ్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

విడుదలైన 19 రోజులకే వైల్డ్ డాగ్ సినిమా ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.గతంలో కొన్ని హిందీ సినిమాల్లో నటించిన నాగార్జున ప్రస్తుతం బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటిస్తున్నారు.

దాదాపు 17 సంవత్సరాల విరామం తరువాత బ్రహ్మాస్త్ర సినిమాలో నటిస్తున్న నాగార్జున ఆ సినిమాలో నటించడం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.గతంలో తాను కొన్ని బాలీవుడ్ సినిమాలలో నటించానని నాగ్ అన్నారు.

Telugu Alia Bhatt, Amitab Bacchan, Bollywood, Brahmastra, Nagarjuna, Ranbeer Kap

ఏ ఇండస్ట్రీలోనైనా నాలాంటి నటులు ఇమిడిపోగలరని అంటూ నాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తాను హిందీ సినిమాలు చేయనని చెప్పనని అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ కోసం మాత్రం తాను తాపత్రయపడలేదని నాగార్జున వెల్లడించారు.మంచి స్టోరీలు వస్తే బాలీవుడ్ సినిమాలలో నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని నాగార్జున పేర్కొన్నారు.బ్రహ్మాస్త్ర సినిమాతో రణ్ బీర్ కపూర్, అలియా భట్ కు తనకు ఎక్కువ సీన్లు ఉన్నాయని నాగార్జున తెలిపారు.

అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించినప్పటికీ అమితాబ్, తన కాంబినేషన్ లో ఎక్కువ సన్నివేశాలు లేవని నాగ్ చెప్పుకొచ్చారు.తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్టైన శివ రీమేక్ ద్వారా బాలీవుడ్ కు పరిచయమైన నాగార్జున ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో నటించారు.

బ్రహ్మాస్త సినిమా మూడు భాగాలుగా తెరకెక్కుతుండగా బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదే విడుదల కానుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube