వామ్మో.. బిగ్ బాస్6 కోసం నాగార్జున అన్ని రూ.కోట్లు తీసుకుంటున్నారా?

బిగ్ బాస్ షో తెలుగు సీజన్6 కు నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించనున్నారనే సంగతి తెలిసిందే.అతి త్వరలో బిగ్ బాస్ షో సీజన్6 షూట్ మొదలుకానుంది.

 Hero Nagarjuna Remuneration For Bigg Boss Season 6 Details Here  Nagarjuna, Remu-TeluguStop.com

సెప్టెంబర్ 4వ తేదీన బిగ్ బాస్ షో ప్రారంభం కానుండగా ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా ఫైనల్ అయిందని సమాచారం అందుతోంది.శ్రీహాన్, చలకీ చంటి, శ్రీ సత్య, ఆదిరెడ్డి, జబర్దస్త్ అప్పారావు, ఆర్జే సూర్య, అమర్ దీప్, దీపికా పిల్లి, నేహా చౌదరి ఈ జాబితాలో ఉన్నారని సమాచారం.

ఉదయభాను, టీవీ9 ప్రత్యూష, డ్యాన్సర్ పండు, సుదీప(నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్) కూడా ఈ జాబితాలో ఉన్నారని సమాచారం అందుతోంది.మరోవైపు బిగ్ బాస్ సీజన్6 కోసం హోస్ట్ నాగార్జున కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

బిగ్ బాస్6 కోసం నాగ్ రెమ్యునరేషన్ ఏకంగా 12 కోట్ల రూపాయలు అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.నాగార్జున సినిమాల ద్వారా సంపాదించే మొత్తం కంటే రియాలిటీ షోల ద్వారా సంపాదించే మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో కీలక మార్పులు చేశారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఉండనుందని ఈ సీజన్ కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా నాగార్జున సైతం జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

Telugu Adi, Bigg Boss, Bigg Boss Show, Chalaki Chanti, Nagarjuna, Sri Satya, Sri

నాగార్జున మరోవైపు వరుస సినిమాలలో నటిస్తుండగా నాగ్ నటించిన ది ఘోస్ట్ సినిమా ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది.ఈ సినిమాతో పాటు నాగార్జున నటించిన బ్రహ్మాస్త్రం సినిమా కూడా థియేటర్లలో ఈ ఏడాదే విడుదల కానుందనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలతో నాగార్జున ఖాతాలో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube