ఆ సమయంలో డిప్రెస్ అయ్యానంటున్న నాగార్జున...

స్టార్ హీరో నాగార్జున ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.గతంలో ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతుందని జోరుగా ప్రచారం జరగగా కేంద్రం థియేటర్లపై ఆంక్షలు తొలగించిన నేపథ్యంలో నాగార్జున థియేటర్లలో సినిమా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

 Hero Nagarjuna Interesting Comments About Wild Dog Movie, Nagarjuna, Wild Dog Mo-TeluguStop.com

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ నెల 2వ తేదీన వైల్డ్ డాగ్ మూవీ విడుదల కానుందని నాగార్జున తెలిపారు.

నిన్న వైల్డ్ డాగ్ సినిమా విలేకర్ల సమావేశం జరగగా హీరో నాగార్జున మాట్లాడుతూ థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కావాల్సిన వైల్డ్ డాగ్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేస్తున్నామని చెప్పారు.

ప్రేక్షకులు వైల్డ్ డాగ్ మూవీని థియేటర్లలో చూస్తే కొత్త అనుభూతిని పొందుతారని నాగార్జున అన్నారు.గత 37 సంవత్సరాలుగా వరుస షూటింగ్ లతో తాను బిజీగా ఉండేవాడినని నాగార్జున తెలిపారు.

అయితే కరోనా విజృంభణ లాక్ డౌన్ విధించడంతో ఫ్యామిలీతో కలిసి ఉండటానికి టైమ్ దొరికిందని.కానీ ఎప్పుడూ షూటింగ్ లతో బిజీగా ఉండే తనకు 2020 సంవత్సరంలో షూటింగ్ లు లేకపోవడం వల్ల డిప్రెషన్ గా అనిపించిందని నాగార్జున పేర్కొన్నారు.2020 సంవత్సరాన్ని తన లైఫ్ నుంచి తీసేశానంటూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ పేలుళ్లకు సంబంధించిన కథతో వైల్డ్ డాగ్ తెరకెక్కినట్టు నాగార్జున తెలిపారు.

ఈ నెల 10వ తేదీన వైల్డ్ డాగ్ మూవీ ట్రైలర్ విడుదల కానుంది.సినిమా విడుదలైన 45 రోజుల తరువాత నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా తరువాత నాగార్జున బంగార్రాజు సినిమాలో నటిస్తుండగా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube