కింగ్ నాగార్జున.. జీ5కి అన్ అఫీషియల్ బ్రాండింగ్..!

కింగ్ నాగార్జున నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాను జీ 5 డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ మొత్తం అందుకున్నట్టు టాక్.సినిమా బ్లాక్ బస్టర్ కాబట్టి నాన్ థియేట్రికల్ రైట్స్ తో కూడా నాగార్జున భారీగా లాభ పడ్డాడని అంటున్నారు.

 Nagarjuna Branding For Zee 5 Details, Zee 5 Ott, Nagarjuna, Priyadarshi,loser Se-TeluguStop.com

అందుకే జీ 5 డిజిటల్ రిలీజ్ లకు నాగార్జున ప్రమోట్ చేస్తున్నారు.తన సినిమా వరకు ఓకే కానీ జీ 5లో రాబోతున్న లూజర్ వెబ్ సీరీస్ పార్ట్ 2కి నాగార్జున ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఈ వెబ్ మూవీ ఈవెంట్ లో నాగార్జున స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

ప్రియదర్శి లీడ్ రోల్ లో నటించిన లూజర్ పార్ట్ 1 సూపర్ హిట్ కాగా ఇప్పుడు లూజర్ పార్ట్ 2 త్వరలో రాబోతుంది.

ఈ వెబ్ మూవీ కోసం నాగార్జున ప్రమోట్ చేస్తున్నారు.ఇది చూస్తుంటే నాగార్జున జీ 5కి అనధికారికంగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడని కొందరు చెప్పుకుంటున్నారు.డిస్నీ హాట్ స్టార్ కోసం చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ఆహా కోసం అల్లు అర్జున్ ని వాడేస్తున్నారు.ఇక ఇప్పుడు అదే రేంజ్ లో జీ 5 ఓటీటీ కోసం నాగార్జునని తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది.

డిజిటల్ మీడియాలో కంటెంట్ ప్రమోట్ చేయడంలో నాగార్జున తర్వాతే ఎవరైనా అనిపించేలా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube