ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతున్న నాగ్.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరో నాగార్జునకు ఈ మధ్య కాలంలో నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూ మార్కెట్ ను తగ్గిస్తున్నాయి.నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా ఈ నెల 2వ తేదీన విడుదల కాగా ఆ సినిమా ఫ్లాప్ ఫలితాన్ని అందుకుంది.

 Hero Nagarjuna Attending Online Classes Why Because,latest Viral News-TeluguStop.com

బంగార్రాజు సినిమా కథలో నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటన చేసిన నాగ్ ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటినుంచి పాల్గొంటారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.మరోవైపు ఈ సినిమా తరువాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో నాగార్జున నటించాల్సి ఉంది.

ఇప్పటికే కొన్ని సినిమాల్లో పోలీస్ ఆఫీసర్, ఎన్నైఏ ఆఫీసర్ రోల్స్ లో నటించిన నాగార్జున ఈ సినిమాలో రా ఏజెంట్ గా కనిపిస్తున్నారని సమాచారం.నాగార్జునకు జోడీగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.

దడ సినిమాలో కొడుకు నాగచైతన్యతో కలిసి ఆడిపాడిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తండ్రి నాగార్జునతో నటిస్తుండటం గమనార్హం.ఒకప్పుడు యంగ్ హీరోలతో ఎక్కువగా నటించిన కాజల్ అవకాశాలు తగ్గడంతో సీనియర్ హీరోల సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

అయితే నాగార్జున ఈ సినిమా కొరకు క్రవ్ మగా పేరుతో పిలవబడే యుద్ధకళను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.కరోనా వల్ల మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు ఇండియాకు రాలేకపోవడంతో ఆన్ లైన్ క్లాసుల ద్వారా నాగ్ ఈ యుద్ధ విద్యను నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ యుద్ధకళతో పాటు కటానా అనే మరో యుద్ధకళను కూడా నాగార్జున నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.బాలీవుడ్ హీరోయిన్ గుల్ పనాగ్ కూడా ఈ సినిమలో నటిస్తున్నారని సమాచారం.

ఆరు పదుల వయస్సులో కూడా నాగార్జున జయాపజయాలకు అతీతంగా కొత్త తరహా కథలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.ప్రవీణ్ సత్తారు ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube