అఖిల్ కోసం ఆ బట్టలు కొన్న నాగార్జున.. విషయం తెలిసి షాక్..?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అఖిల్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తన రేంజ్ కు తగిన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు.ఇప్పటివరకు అఖిల్ మూడు సినిమాల్లో నటించగా ఆ మూడు సినిమాలు ఒకదానిని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.

 Hero Nagarjuna About Akhil Akkineni Birth Story, Akhil Akkineni,  Birth Story ,-TeluguStop.com

వరుస ఫ్లాపుల వల్ల అఖిల్ మార్కెట్ సైతం అంతకంతకూ తగ్గుతుండటంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడుతున్నారు.

ప్రస్తుతం అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాలతో అఖిల్ సక్సెస్ సాధిస్తాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అయితే అఖిల్ పుట్టకముందు నాగార్జున అమలకు అమ్మాయి పుడుతుందని భావించారట.అఖిల్ కోసం చిన్నపిల్లలకు వేసే బట్టలను కూడా కొన్నారట.ఒక ఇంటర్వ్యూలో నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించారు.

Telugu Akhil Akkineni, Bangarraju, Story, Nagarjuna, Ollywood, Sogagadchinni-Mov

నాగార్జునకు, అమలకు ఆడపిల్ల పుట్టాలనే కోరిక ఉండగా అమెరికాలో స్కానింగ్ లో ఆడపిల్ల పుడుతుందని డాక్టర్లు చెప్పారు.ఇండియాలో ఉన్న విధంగా స్కానింగ్ విషయంలో అమెరికాలో నిబంధనలు ఉండవు.ఆడపిల్ల పుడుతుందని భావించి అమ్మాయి పుడితే పెట్టడానికి నాగార్జున పేరు కూడా ఫిక్స్ అయ్యారు.

అయితే డెలివరీ టైమ్ లో అబ్బాయి పుట్టాడని తెలిసి షాకయ్యానని నాగార్జున పేర్కొన్నారు.

Telugu Akhil Akkineni, Bangarraju, Story, Nagarjuna, Ollywood, Sogagadchinni-Mov

సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నాగార్జున సైతం వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నారు.అయితే ఆ తరువాత నాగార్జున నటించిన సినిమాలు హిట్లు కావడంతో పాటు నాగార్జునకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.మరోవైపు నాగార్జునకు కూడా ఈ మధ్య కాలంలొ నటించిన సినిమాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను ఇవ్వడం లేదు.

సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ బంగార్రాజుతో సక్సెస్ సాధిస్తానని నాగార్జున భావిస్తుండగా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube