ఆ విషయంలో సమంత బెస్ట్ అంటున్న నాగచైతన్య.. అభిమానులు షాకయ్యేలా?

Hero Nagachaitanya Talking On Screen Romance About Heroine Samantha

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలలో నటిస్తున్న హీరోలలో నాగచైతన్య కూడా ఒకరనే సంగతి తెలిసిందే.గతేడాది ఆగష్టులో లవ్ స్టోరీ సినిమాను విడుదల చేసిన నాగచైతన్య కొన్ని నెలల గ్యాప్ లోనే తను హీరోగా నటించిన బంగార్రాజు సినిమాను విడుదల చేశారు.

 Hero Nagachaitanya Talking On Screen Romance About Heroine Samantha-TeluguStop.com

చైతన్య నటిస్తున్న థాంక్యూ మూవీ సైతం ఈ ఏడాదే విడుదల కానుంది.ఒక హర్రర్ వెబ్ సిరీస్ కు సైతం చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమాకు, హర్రర్ వెబ్ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ మొదలు కాగా అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సిరీస్ రిలీజ్ కానుంది.

 Hero Nagachaitanya Talking On Screen Romance About Heroine Samantha-ఆ విషయంలో సమంత బెస్ట్ అంటున్న నాగచైతన్య.. అభిమానులు షాకయ్యేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే గతేడాది చైతన్య సమంత విడిపోతున్నట్టు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఏ మాయ చేశావె, మనం, ఆటోనగర్ సూర్య, మజిలీ సినిమాలు చై, సామ్ కాంబినేషన్ లో తెరకెక్కగా ఆటోనగర్ సూర్య మినహా మిగతా సినిమాలు సక్సెస్ సాధించాయి.

అయితే తాజాగా నాగచైతన్య బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu Khan, Bangarraju, Nagachatanya, Nagachaitanya, Nagarjuna, Samantha-Movie

ఇప్పటివరకు నటించిన హీరోయిన్లలో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఏ హీరోయిన్ తో ఉందనే ప్రశ్నకు చైతన్య స్పందిస్తూ సమంత పేరు చెప్పారు.విడాకుల తర్వాత కూడా సమంత గురించి చైతన్య పాజిటివ్ గా చెబుతూ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతుండటం గమనార్హం.నాగచైతన్య చేసిన కామెంట్ల గురించి సమంత స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

Telugu Khan, Bangarraju, Nagachatanya, Nagachaitanya, Nagarjuna, Samantha-Movie

అమీర్ ఖాన్ గురించి చైతన్య మాట్లాడుతూ అమీర్ ఖాన్ అందరితో చక్కగా కలిసిపోతారని ప్రతి క్రాఫ్ట్ పై అమీర్ ఖాన్ కు మంచి పట్టు ఉందని వెల్లడించారు.బిగ్ బాస్ షోను నాన్న రన్ చేసే తీరు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని నాగచైతన్య చెప్పుకొచ్చారు.

#Samantha #Khan #Nagachaitanya #Samantha #NagaChatanya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube