నా పేరును అలా వాడటం నచ్చలేదు.. ఆ వార్తలపై స్పందించిన నాగచైతన్య!

అక్కినేని హీరో నాగచైతన్య మజిలీ, వెంకీ మామ సినిమాల విజయాల తర్వాత నటించిన లవ్ స్టోరీ మూవీ రేపు రిలీజ్ కానుంది.లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన నాగచైతన్య నటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన సమయంలోనే ప్రొఫెషనల్ లైఫ్ ను, పర్సనల్ లైఫ్ ను ఒకే విధంగా చూడకూడదని అనుకున్నానని తెలిపారు.

 Hero Nagachaitanya Response About Viral Gossips-TeluguStop.com

తన పేరెంట్స్ ద్వారా తాను ఈ విషయాన్ని తెలుసుకున్నానని చైతన్య చెప్పుకొచ్చారు.

తన తల్లిదండ్రులు షూటింగ్ లు లేదా ఇతర పనులను పూర్తి చేసిన తర్వాత ఇంట్లో ఆ విషయాల గురించి ఎటువంటి చర్చలు జరపరని నాగచైతన్య అన్నారు.

 Hero Nagachaitanya Response About Viral Gossips-నా పేరును అలా వాడటం నచ్చలేదు.. ఆ వార్తలపై స్పందించిన నాగచైతన్య-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అదే సమయంలో వర్క్ తో బిజీగా ఉంటే వ్యక్తిగత జీవితం గురించి తన తల్లిదండ్రులు అస్సలు ఆలోచించరని నాగచైతన్య చెప్పుకొచ్చారు.సోషల్ మీడియాలో ప్రచారమయ్యే గాసిప్స్ గురించి సైతం చైతన్య స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన గురించి ఒకానొక సమయంలో ఎన్నో ఫేక్ న్యూస్ ప్రచారంలోకి వచ్చాయని చైతన్య వెల్లడించారు.తన గురించి తప్పుగా ప్రచారంలోకి వచ్చిన వార్తలను చూసి తాను ఎంతో బాధ పడ్డానని చైతన్య తెలిపారు.ఆ వార్తలను చదివిన సమయంలో అలాంటి వార్తలను ఏ విధంగా రాస్తారని తాను అనుకున్నానని చైతన్య వెల్లడించారు.పాత రోజుల్లో ప్రతి నెలకు ఒక మ్యాగజైన్ వచ్చేదని ఆ మ్యాగజైన్ల వల్ల నెలరోజులు ఒకటే వార్త కనిపించేదని నాగచైతన్య వెల్లడించారు.

Telugu About Viral Gossips, Interesting Facts, Love Story, Nagachaitnya, Saipallavi, Samantha, Shekar Kammual, Social Media, Viral Gossips-Movie

గతంతో పోలిస్తే అప్పటికీ ఇప్పటీ పరిస్థితులలో చాలా మార్పు వచ్చిందని చైతన్య చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ఒక వార్త ప్రచారంలోకి రాగానే ఆ వార్తను మరో వార్త రిప్లేస్ చేస్తుందని కామెంట్లు చేశారు.ఆ తర్వాత ప్రజలు నిజాలను మాత్రమే గుర్తు పెట్టుకుంటారని అర్థమైందని చైతన్య అన్నారు.

#Gossips #Samantha #Shekar Kammual #Gossips #Love Story

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు