‘మా’ సభ్యులంతా జోకర్లు అంటూ కామెంట్లు చేసిన వర్మ.. మనోజ్ షాకింగ్ రిప్లై?

వివాదాస్పద దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరును సొంతం చేసుకున్న రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదాల గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక సర్కస్ అని అందులో ఉండేవాళ్లు అంతా జోకర్లు అంటూ కామెంట్లు చేశారు.

 Hero Manchu Manoj Strong Counter To Director Ram Gopal Varma Details, Hero Manch-TeluguStop.com

వర్మ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ ట్వీట్ గురించి నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రముఖ నటుడు మంచు మనోజ్ వర్మ ట్వీట్ కు షాకింగ్ రిప్లై ఇచ్చారు.

‘మా’ సర్కస్ అయితే రామ్ గోపాల్ వర్మ రింగ్ మాస్టర్ అని మనోజ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.మనోజ్ చేసిన షాకింగ్ ట్వీట్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

అనవసర వివాదాల ద్వారా వర్మ నిత్యం వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

‘మా’ ఎన్నికలు జరిగి వారం రోజులైనా ఈ ఎన్నికల వల్ల ‘మా’ సభ్యుల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి.ప్రకాష్ రాజ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విష్ణుపై, మోహన్ బాబుపై, ఎన్నికల అధికారి కృష్ణమోహన్ గురించి సంచలన ఆరోపణలు చేశారు.వర్మ సినిమా వాళ్ల పరువును తీస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఆర్జీవీ వెటకారానికి హద్దు లేకుండా పోతుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.‘మా’ ను అడ్డు పెట్టుకొని వర్మ ఇష్టానుసారం కామెంట్లు చేస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వర్మ తన ప్రవర్తనను మార్చుకోవాలని కొంతమంది నెటిజన్లు సూచనలు చేస్తుండటం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని అతని అభిమానులు కీలక సూచనలు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube