ఊహించిన దానికంటే ఎక్కువే ప్రేమిస్తున్నా.. మహేష్ కామెంట్స్ వైరల్?

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితారకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.సితారను అభిమానించే అభిమానులు చాలామందే ఉన్నారు.

 Hero Mahesh Babu Wishes Daughter Sitara On 9 Th Birthday-TeluguStop.com

నేడు సితార పుట్టినరోజు కాగా మహేష్ సితారకు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియాలో సితార ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అందుకున్నారు.

సితార సొంత యూట్యూబ్ ఛానల్ లో చేసిన వీడియోలు సైతం నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

 Hero Mahesh Babu Wishes Daughter Sitara On 9 Th Birthday-ఊహించిన దానికంటే ఎక్కువే ప్రేమిస్తున్నా.. మహేష్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎ అండ్ ఎస్ పేరుతో ఆద్యతో కలిసి సితార సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

మహేష్ తన ట్వీట్ లో నా చిన్నారికి బర్త్ డే గ్రీటింగ్స్ అని చెప్పుకొచ్చారు.నా ప్రపంచానికి నువ్వే ఎప్పుడూ వెలుగును ఇస్తున్నావని మహేష్ పేర్కొన్నారు.కూతురు ఎదుగుదల చూడటం తండ్రిగా తనకు ఆనందాన్ని తన కూతురు ఎల్లప్పుడూ ఆకాశాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలని మహేష్ బాబు అన్నారు.

తాను ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నానని మహేష్ బాబు కూతురుకు చెప్పుకొచ్చారు.ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని సితార తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారు.గౌతమ్ సితార గురించి సితార తనకు చాలా కోపం తెప్పిస్తుందని పేర్కొన్నారు.

అయితే తన సిస్టర్ లేకుండా ఒక్కరోజును కూడా ఊహించుకోలేనని గౌతమ్ సితార గురించి వెల్లడించడం గమనార్హం.

సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు సితారకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.సితార పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో #sitaraturns9 అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.మహేష్ ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ నటుడిగా బిజీగా ఉన్నారు.

సితార కూడా భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.సితార సినిమాల్లోకి రావాలని మహేష్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

#Youtube Channel #Sitara #Social Media #Viral #MaheshBabu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు