హీరో మహేశ్ బాబుకి మాతృవియోగం

ప్రముఖ సినీ నటుడు, సూపర్ స్టార్ మహేశ్ బాబుకు మాతృవియోగం కలిగింది.సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి (70) కన్నుమూశారు.

 Hero Mahesh Babu Lost His Mother , Hero Mahesh Babu, Indira Devi, Ramesh Babu ,-TeluguStop.com

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు.కొద్ది రోజులుగా ఇంటికే పరిమితమైన ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఇందిరా దేవి కన్నుమూశారు.ఇందిరాదేవి మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆమె మరణవార్త తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియ జేస్తున్నారు.

కృష్ణకు ఇందిరాదేవి మొదటి భార్య.వీరికి ఐదుగురు సంతానం.ఇద్దరు కుమారులు రమేశ్ బాబు, మహేశ్ బాబు తో పాటు ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శినిలు ఉన్నారు.అయితే, ఇటీవలే రమేశ్ బాబు అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.

 Hero Mahesh Babu Lost His Mother , Hero Mahesh Babu, Indira Devi, Ramesh Babu ,-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇందిరా దేవి పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు.

అనంతరం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube