సోనూసూద్ నువ్వే మా స్పూర్తి.. అభినందించిన మాధవన్..!

కరోనా వారియర్ గా సోనూసూద్ మరోసారి తన గొప్ప మనసుని చాటుకుంటున్నాడు.కరోనా టైం లో ఆపద అని తెలిసిన వెంటనే ప్రభుత్వాల కన్నా సోనూ సూద్ స్పందిస్తున్నారు.

 Hero Madhavan Praises Sonusood-TeluguStop.com

కరోనా సెకండ్ వేవ్ టైం లో కూడా సోనూ సూద్ చేస్తున్న సహాయాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్, బెడ్స్ లేక ఇబ్బందులు పడుతున్న సమాన్యులకు తన వంతు సాయాన్ని అందిస్తున్నారు సోనూ సూద్.

ఇక రీసెంట్ గా బెంగుళూరులో సోనూ సూద్ అండ్ టీం చేసిన సాయం వల్ల 22 మంది కోవిడ్ బారి నుండి బయటపడ్డారు.ఈ విషయం తెలుసుకున్న తమిళ హీరో మాధవన్ తన ట్విట్టర్ ద్వాతా సోనూ సూద్ ను అభినందించారు.

 Hero Madhavan Praises Sonusood-సోనూసూద్ నువ్వే మా స్పూర్తి.. అభినందించిన మాధవన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

22 మందిని కోవిడ్ బారి నుండి కాపాడిన సోనూ సూద్ కు అతని టీం కు ఆ దేవుడి దయ ఎప్పుడూ ఉండాలని మాధవన్ అన్నారు.అంతేకాదు నువ్వు ఎందరికో స్పూర్తిగా నిలుస్తున్నావని అన్నారు మాధవన్.

కరోనా టైం లో సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆయనకు స్టార్ హీరోల కన్నా గొప్ప మనసని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.స్టార్ హీరోలు విరాళాలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంటే సోనూ సూద్ మాత్రం ఆపద అనగానే అక్కడ కావాల్సిన ఏర్పాట్లను చేస్తూ అందరు హృదయాలను గెలుస్తున్నాడు.

#Activities #MadhavanPraises #SonuSood #Madhavan #Second Wave

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు