హీరో కృష్ణ తాను పెంచిన చెట్టును తానే నరికేశాడు.. ?

తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని వ్యక్తులు సూపర్ స్టార్ కృష్ణ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.వీరిద్దరూ సినిమా ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించారు.ఇంచుమించు ఇద్దరూ ఒకేసారి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు.కొద్దీ కాలంలోనే మంచి మిత్రులుగా మారిపోయారు.వివాదాలకు దూరంగా ఉండే ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఓ వివాదం చెలరేగింది.దాని దెబ్బకు మూడేళ్లు ఒకరినొకరు పలకరించుకోలేదు.

 Hero Krishna Controversy With Sp Balasubramanyam, Hero Krishna, Sp Balu, Sp Bala-TeluguStop.com

ఇంతకీ వీరి మధ్య ఎక్కడ చెందింది అనే విషయాలు తెలుసుకుందాం.

కృష్ణ, బాలు సినిమాల్లోకి వచ్చే సమయానికి ఘంటసాల టాప్ పొజిషన్లో వున్నాడు.

ఆయనను ఢీకొట్టే గాయకుడు దరిదాపుల్లో కూడా లేడు.తొలుత కామెడియన్లకు బాలు పాటలు పాడేవాడు.

అదే సమయంలో ఘంటసాల అనారోగ్య కారణంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలకు మాత్రమే పాడేవారు.దీంతో కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు పాడే అవకాశం బాలుకు వచ్చింది.

ఈ సమయంలో ఘంటసాల కన్నుమూశారు.ఈ దెబ్బకు ఎన్టీఆర్ పాటలు లేకుండానే సినిమాలు చేశారు.

అదే సమయంలో రామకృష్ణ అనే గాయకు మంచి గాయకుడిగా ఎదిగాడు.టాప్ హీరోలకు తనే పాడేవారు.

అదే సమయంలో బాలుకు కృష్ణ అండగా నిలబడ్డాడు.తన సినిమాల్లో బాలుతోనే పాడిoచుకున్నాడు.

బాలు, కృష్ణ మంచి మిత్రులు అనే పేరు పడింది.

Telugu Krishna, Conflictsp, Ghantashala, Shoban Babu, Raj Koti, Sp Balu, Spbala,

ఆ తర్వాత దాస్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా కెప్టెన్ కృష్ణ సినిమా తెరకెక్కుతున్నది.ఈ సినిమా సమయంలో ఇద్దరిమధ్య వివాదం చెలరేగింది.తనకు ఈ సినిమా నిర్మాత బాకీ పడ్డ డబ్బులు ఇచ్చే వరకు ఈ సినిమాలో పాడను అని బాలు చెప్పాడు.

కృష్ణ ఫోన్ చేసి మాట్లాడినా నో చెప్పాడు బాలు.ఈ ఘటనతో ఇద్దరు దూరం అయ్యారు.

ఇదే సమయంలో కృష్ణ సినిమాల్లో రాజ్ సీతారాం అనే గాయకుడు పాడటం మొదలు పెట్టాడు.సుమారు 3 ఏండ్ల వరకు కృష్ణ, బాలు వివాదం కొనసాగింది.

Telugu Krishna, Conflictsp, Ghantashala, Shoban Babu, Raj Koti, Sp Balu, Spbala,

వీరిద్దరి మధ్య వివాదాన్ని చేరిపేసేందుకు ప్రయత్నం చేసాడు సంగీత దర్శకుడు రాజ్ కోటి.ఈ విషయం గురించి బాలుతో మాట్లాడారు.కృష్ణతో మాట్లాడాలి అనుకున్నాడు.కానీ బాలు కృష్ణ పద్మాలయ స్టూడియోలో కలిసి సారీ చెప్పబోయాడు.గతం వద్దు.ప్రస్తుతం కలిసి పనిచేద్దాం అని చెప్పాడు.

అప్పటి నుంచి బాలు కృష్ణ సినిమాలకు పాడటం కంటిన్యూ చేసాడు.అయితే మూడేళ్ళ పాటు కృష్ణ సినిమాలకు పాడిన రాజ్ సీతారాంకు మళ్ళీ కృష్ణ సినిమాలో పాడే అవకాశం ఒక్కసారి కూడా రాలేదు.

తను సినిమా పరిశ్రమ నుంచే బయటకు వెళ్ళిపోయాడు.తనకు అవకాశాలు రాకుండా చేసిందే బాలు అనే ఆరోపణలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube