హిప్పీతో ఫ్లాప్ కొట్టిన కాన్ఫిడెంట్ గా ఉన్న కార్తికేయ!  

తానెంటో చూపిస్తా అంటున్న హీరో కార్తికేయ. .

Hero Karthikeya Interesting Comments About Gossips On New Movie-

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లో హీరోగా తనదైన ముద్ర వేసిన నటుడు కార్తికేయ.ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న కార్తికేయ ఊహించని విధంగా తన రెండో సినిమా అని తమిళ బడా నిర్మాణ సంస్థలో చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.హిప్పి టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్లో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది..

Hero Karthikeya Interesting Comments About Gossips On New Movie--Hero Karthikeya Interesting Comments About Gossips On New Movie-

ఇక ఈ సినిమా కారణంగా అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు తిరిగి తీసుకోవడానికి సిద్ధమైనట్లు టాలీవుడ్ లో లో వినిపిస్తున్న సమాచారం.అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది తెలియదు కానీ హిప్పి సినిమా ఫ్లాప్ అయినా కూడా కార్తికేయ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

త్వరలో మరో సినిమాతో కార్తికేయ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

గుణ 369 టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.హిప్పి సినిమా తర్వాత మీడియా ముందుకి వచ్చిన కార్తికేయ తన మీద వస్తున్న రూమర్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా కూడా నేరుగా వారికి తన యాక్టింగ్ తో సమాధానం చెబుతానని కార్తికేయ చెప్పుకొచ్చాడు.త్వరలో విక్రమ్ కె.

కుమార్ దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి కూడా ఈ సందర్భంగా చెప్పినట్లు తెలుస్తుంది.గ్యాంగ్ లీడర్ సినిమాలో తన మార్క్ పర్ఫార్మెన్స్ తో మరోసారి పని ఏంటో చూపించుకుంటా అని కార్తికేయ చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.