అనసూయ అంటే మరీ అంత ఇది ఏందయ్యా నీకు?

హీరోలంటే చాలా మంది అభిమానులను కలిగి ఉంటారు.చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా అభిమానులు ఖచ్చితంగా ఉంటారు.

 Hero Karthikeya Comments On Jabardast Anchor Anasuya In Chavu Kaburu Challaga Ev-TeluguStop.com

ఆర్‌ఎక్స్‌ 100 సినిమా తో మాస్ ఆడియన్స్ ను మెప్పించిన కార్తికేయ అంటే చాలా మందికి అభిమానం.ఆయనకు మాత్రం జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ అంటే పిచ్చ అభిమానం.

ఆ విషయాన్ని గతంలోనే ఒక టీవీ షో లో చెప్పిన కార్తికేయ తాజాగా చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో కూడా చెప్పాడు.చావు కబురు చల్లగా సినిమా లో అనసూయ ఐటెం సాంగ్‌ ను చేసిన విషయం తెల్సిందే.

సినిమా ప్రీ రిలీజ్ సందర్బంగా ఆ పాట చిత్రీకరణ సమయంలో జరిగిన విషయాన్ని కార్తికేయ చెప్పి తనకు అనసూయ పై ఉన్న అభిమానంను చెప్పకనే చెప్పాడు.

చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కార్తికేయ మాట్లాడుతూ నాకు అనసూయ గారు అంటే చాలా ఇష్టం.

సినిమా లో పాట షూటింగ్‌ కు మొదటి రోజు ఆమె వచ్చిన సమయంలో వెంటనే దూరంగా వెళ్లి కూర్చున్నాను.ఆమెనే చూస్తూ అలా ఉండి పోయాను.దగ్గర నుండి మిడి గుడ్డు వేసుకుని అలా చూస్తూ బాగోదని దూరం నుండి ఆమెను అలాగే చూస్తూ ఉండి పోయాను.అంత ఇష్టం అండి మీరు అంటే అంటూ అనసూయ పై తనకు ఉన్న అభిమానంను స్టేజ్‌ పై తెలియజేశాడు.

మొత్తానికి కార్తికేయ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి.గతంలో అనసూయ షో కు వచ్చి ఆమె తో డాన్స్ చేయకుంటే అమ్మ నాకు అన్నం పెట్టదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.

అనసూయ కు కూడా కార్తికేయ అంటే అభిమానం అందుకే చావు కబురు చల్లగా సినిమా లో ఐటెం సాంగ్‌ చేసేందుకు ఒప్పుకుంది.ఆమద్య ప్రత్యేక పాటలు చేయను అన్న అనసూయ కార్తి కేయ కోసం ఈ పాటను చేసినట్లుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube