'బెదురు లంక 2012' టీజర్ డేట్ లాక్.. ఈసారి అయినా హిట్ కొట్టేనా?

ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా ఉండడం లేదు.ప్రేక్షకుల ఆలోచన విధానంలో చాలా మార్పు రావడం వల్ల సినిమాలో కంటెంట్ ఉందా లేదా అని చూస్తున్నారు కానీ అది పెద్ద హీరో సినిమానా చిన్న హీరో సినిమానా అనేది చూడడం లేదు.

 Hero Karthikeya Bedurulanka 2012 Movie Teaser Dete Fix Details, Bedurulanka 2012-TeluguStop.com

కంటెంట్ లేకుండా కమర్షియల్ గా వస్తే స్టార్ హీరోల సినిమాలను కూడా డిజాస్టర్స్ చేస్తున్నారు.

ఇది వరకులా కాకుండా ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

దీంతో చిన్న హీరోలు కూడా మంచి కంటెంట్ తో వచ్చి పాన్ ఇండియా వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు.కంటెంట్ ఉంటే చాలు.

పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేసిన హిట్ అందుకోవడం గ్యారెంటీ అని ప్రేక్షకులు నిరూపిస్తున్నారు.

Telugu Bedurulanka, Neha Shetty, Kartikeya-Movie

అందుకే చిన్న హీరోలు కూడా ఎలాంటి కమర్షియల్ సినిమాలు చేయకుండా కేవలం టాలెంట్ ఉన్న దర్శకులకు మాత్రమే ఛాన్స్ ఇస్తూ మంచి జోనర్స్ లో థ్రిల్లింగ్ గా సినిమాలను చేస్తున్నారు.మరి తెలుగులో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కార్తికేయ కూడా ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Telugu Bedurulanka, Neha Shetty, Kartikeya-Movie

ఈ క్రమంలోనే ఈయన డిఫెరెంట్ జోనర్ లో థ్రిల్లింగ్ కథను ఎంచుకున్నాడు.కార్తికేయ మరో కొత్త చిత్రంతో త్వరలోనే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.కార్తికేయ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ”బెదురులంక 2012”.

ఈ సినిమాను డైరెక్టర్ క్లాక్స్ థ్రిల్లర్ జోనర్ లో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే గ్లిమ్స్ రాగా మంచి స్పందన లభించింది.

ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ కాబోతుంది.ఈ టీజర్ ఫిబ్రవరి 10న సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇక ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.మరి కార్తికేయ ఈ క్రేజీ సినిమాతో హిట్ సొంతం చేసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube